AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakapatnam: విశాఖ మన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జ్వరాలు.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనాలు..

Visakhapatnam: విశాఖ మన్యాన్ని డెంగ్యూ జ్వరం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనా కాస్త ఊరటనిచ్చిందనుకునే లోపే డెంగ్యూ జ్వరం మన్యం వాసులకు..

Visakapatnam: విశాఖ మన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జ్వరాలు.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనాలు..
Visakha
Shiva Prajapati
|

Updated on: Aug 22, 2021 | 12:07 PM

Share

Visakhapatnam: విశాఖ మన్యాన్ని డెంగ్యూ జ్వరం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనా కాస్త ఊరటనిచ్చిందనుకునే లోపే డెంగ్యూ జ్వరం మన్యం వాసులకు భతపెడుతోంది. డెంగ్యూ తో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ ఆకస్మికంగా మృతిచెందడం.. అడవిబిడ్డల్లో మరింత ఆందోళన రేపుతోంది. మన్యం ప్రాంతంలోని కొయ్యూరు మండలం శరభన్నపాలేనికి చెందిన లోకుల గాంధీ డెంగ్యూతో కేజీహెచ్ లో చేరి ప్రాణాలు కోల్పోయారు.

కాగా, విశాఖ ఏజెన్సీలో ప్రజలు డెంగ్యూతో ఒక్కొక్కరుగా ఆసుపత్రిలో చేరుతున్నారు. జ్వరం, ఒళ్ళునొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏజెన్సీ వ్యాప్తంగా ఇప్పటివరకు 13 కేసులు నమోదైనా అనధికారికంగా జ్వర పీడితులు ఎక్కువమందే ఉన్నారు. ఏజెన్సీలో 11 మండలాలున్నాయి. ఆరున్నర లక్షల జనాభా. చాలా చోట్ల విష జ్వరాలు ప్రబలుతూ ఉన్నాయి. వర్షాలు కురుస్తుండడం, నీరు కలుషితమవడానికి తోడు దోమల బెడద ఈ సీజన్ లో పెరుగుతున్న నేపథ్యంలో బాధితుల సంఖ్య పెరుగుతోంది.

విశాఖ మన్యంలో ఇప్పటివరకు 13 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇది అధికారికంగా మాత్రమే. అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుందనేది జనం మాట. ఒక్క పాడేరులోనే 8 వరకు కేసులు నమోదయ్యాయి. ఇవి కాకుండా చాలా చోట్ల గిరిజన గ్రామాల్లో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. జ్వరాలతో మంచం పట్టారు. అయితే.. నిజంగానే డెంగ్యూ జ్వరమా..? లేక మలేరియానా..? కరోనా జ్వరమా అన్నది తేల్చుకోలేక ఆందోళన చెందుతున్నారు జనాలు. భయంతో చాలామంది మైదాన ప్రాంతానికి తరలివెళ్తున్నారు. ఆసుపత్రుల్లో చేరుతున్నారు.

వాస్తవానికి జ్వరాల తీవ్రత పెరిగినా.. ఆసుపత్రులకు బాధితులు క్యూ కడుతున్నా డెంగ్యూ నిర్ధారణ కావడం లేదు. కచ్చితంగా డెంగ్యూ నిర్ధారణ కావాలంటే కేజీహెచ్ ల్యాబ్ లోనే పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అక్కడ తప్ప.. మరెక్కడా జిల్లాలో డెంగ్యూ నిర్ధారణ కేంద్ర గానీ, ల్యాబ్ గానీ లేదు. దీన్ని క్యాష్ చేసుకుంటున్న కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్.. జ్వరాలతో చేరుతున్న వారిని భయపెట్టి డబ్బులు గుంజేస్తున్నారు.

అయితే, ఏజెన్సీలో 13 కేసులే నమోదైనా.. జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల డెంగ్యూ జ్వరాలు ప్రబలుతున్నాయి. 80కి పైగా కేసులు నమోదైనట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తీవ్రత పెరిగి ప్రాణాంతకంగా మారి మరింత మంది ప్రాణాలు హరించకముందే అధికారులు మేల్కొని నివారణా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also read:

Corona Spread: కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్న ప్లాస్టిక్ షీల్డ్స్ కరోనా వ్యాప్తిని ఆపడం కష్టం అంటున్న శాస్త్రవేత్తలు.. ఎందుకంటే..

Nadiya: తెలుగు తెర అందాల అత్తకు కోవిడ్ పాజిటివ్.. వ్యాక్సిన్ తీసుకున్నా వదలని మహమ్మారి..

తాలిబన్ల భయానికి దేశం వదిలిపారిపోతున్న ఆఫ్ఘాన్ ప్రజలు.. ఆశ్రయం ఇవ్వడానికి సిద్ధపడ్డ దేశాలు ఇవే..