AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. ప్రభుత్వం నుంచి రూ.2.50 లక్షలు.. ఈ నెల 14 వరకే ఛాన్స్

మీకు సొంతిల్లు లేదా..? సొంతిల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మీరు రూ.2.50 ఆర్ధిక సాయం పొందవచ్చు. దీనికి దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించారు. ఈ పథకానికి అప్లై చేసుకుని ఆర్ధిక సహాయం పొందండి.

కొత్త ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. ప్రభుత్వం నుంచి రూ.2.50 లక్షలు.. ఈ నెల 14 వరకే ఛాన్స్
Opm Awas Yogana
Venkatrao Lella
|

Updated on: Dec 02, 2025 | 10:40 AM

Share

PM Awas Yojana: తమ కంటూ ఒక సొంతిల్లు కట్టుకోవాలనేది ప్రతీఒక్క సామాన్యుడి కల. ఈ కలను నెరవేర్చుకునేందుకు కాయాకష్టం చేసి డబ్బులు పొగు చేసుకుంటారు. సిమెంట్, ఇసుక, ఇనుము లాంటి ధరలన్నీ అధికం కావడంతో ఇప్పట్లో ఇల్లు నిర్మించుకోవాలంటే లక్షలకు లక్షలకు వెచ్చించాలి. అంత డబ్బులు సామాన్య ప్రజల దగ్గర ఉండవు. అందుకే ప్రభుత్వాలు సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసేందుకు అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. ఈ పధకం ద్వారా ఇల్లు నిర్మించి ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత మొత్తంలో ఆర్ధిక సహాయం అందిస్తున్నాయి. అటువంటి పథకాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఒకటి. ఈ పథకం కింద ఇల్లు ఎలా నిర్మించుకోవాలో చూద్దాం.

దరఖాస్తు ఎలా అంటే..?

తాజాగా ఏపీ ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన, ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవడానికి గుడువును పొడిగించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ స్కీమ్‌ను అందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఈ నెల 14వ తేదీ వరకు ఈ పథకంలో లబ్ది పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకుముందు నవంబర్ 30 వరకు గడువు ఇవ్వగా.. ఎక్కువమంది అప్లై చేసుకునేందుకు గడువు పొడిగించారు. గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి అప్లికేషన్ పెట్టుకోవాలి. పీఎం అవాస్ యోజన pmayg.nic.in వెబ్‌సైట్ ద్వారా కూడా అప్లై చేసుకునే అవకాశముంది. ఏపీలో 15.59 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు కేవలం 3 లక్షల మంది మాత్రమే ఇళ్లను మంజూరు చేయగా.. నాలుగేళ్లల్లో మిగతా ఇళ్లను మంజూరు చేయాలని చూస్తోంది.

సాయం ఎంత వస్తుంది..?

ఈ పధకం కింద అర్హులైన లబ్దిదారులకు రూ.2.50 లక్షల ఆర్ధిక సాయం అందిస్తారు. ఇక స్థలం లేనివారికి 3 సెంట్ల భూమితో పాటు ఆర్ధిక సహాయం అందిస్తారు. తెల్లరేషన్ కార్డు కలిగి ఉండటంతో పాటు సొంతిల్లు ఉండకూడదు.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..