దశాబ్దాల చరిత్ర అమలాపురంలోని దసరా ఉత్సవాలు.. ఇప్పటికీ సినిమావాళ్ళకి ప్రాచీన యుద్ధవిద్యలుకావాలంటే వీరివైపే చూపు

దేశంలో మైసూర్, కోల్ కతా వంటి ప్రాంతాల్లో జరిగే దసరా ఉత్సవాలకు ఎంత పేరు ప్రఖ్యాతలున్నాయో..  అంతే ప్రత్యేకతను సొంతం చేసుకుంది చెడీ తాలింఖన..

దశాబ్దాల చరిత్ర అమలాపురంలోని దసరా ఉత్సవాలు.. ఇప్పటికీ సినిమావాళ్ళకి ప్రాచీన యుద్ధవిద్యలుకావాలంటే వీరివైపే చూపు
Dasara
Follow us

| Edited By: Phani CH

Updated on: Oct 15, 2021 | 9:10 AM

దేశంలో మైసూర్, కోల్ కతా వంటి ప్రాంతాల్లో జరిగే దసరా ఉత్సవాలకు ఎంత పేరు ప్రఖ్యాతలున్నాయో..  అంతే ప్రత్యేకతను సొంతం చేసుకుంది చెడీ తాలింఖన.. దేశంలో మైసూర్, కోల్ కతా వంటి ప్రాంతాల్లో జరిగే దసరా ఉత్సవాలకు ఎంత పేరు ప్రఖ్యాతలున్నాయో..  అంతే ప్రత్యేకతను సొంతం చేసుకున్నాయి అమలాపురంలోని దసరా ఉత్సవాలు. అవును మైసూర్ తర్వాత అంతటి పేరుపొందిన ఉత్సవాలు తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో జరిగే విజయదశమి ఉత్సవాలు.  ఇక్కడ విజయదశమి సందర్భంగా నిర్వహించే చెడి తాలింఖానా, వాహన ఊరేగింపు ప్రత్యేక స్థానం ఉంది.

దసరా పేరు చెప్పగానే తూర్పుగోదావరి జిల్లాలో గుర్తుకు వచ్చేది అమలాపురం చెడి తాలింఖానానే.  అధిక ప్రపంచంలో ప్రాచీన కళలు నానాటికి దిగజారిపోతున్నా ఇప్పటికీ వన్నే తరగని రీతిలో ఈ తాలింఖానాకు ఏడాది ఏడాదికి ప్రాధాన్యతను పెంచుకుంటుంది. ఈ ఉత్సవాల్లో జరిగే చెడీ తాలింఖానాలో వయసు బేధం లేకుండా 10 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు తమ విద్యను ప్రదర్శిస్తుంటారు. రాచరిక కాలపు యుద్ధాన్ని తలపించే ఈ సాహసోపేత విన్యాసాలను తిలకించేందుకు జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి, తెలంగాణ నుంచీ పెద్ద ఎత్తున జనం వస్తారు. దసరాకు ప్రత్యేకంగా తమ కుటుంబాలతో సహా స్థానికులు తరలి వస్తుంటారు. దసరారోజున అమలాపురం వీధుల్లో జరిగే చెడీ తాలింఖానా ప్రదర్శనల సందడి అంతాఇంతా కాదు. వీధుల్లో ప్రాచీన యుద్ధవిన్యాసాలను తలపించేలా యువకులు వృద్ధులు ప్రదర్శించే చెడీతాలింఖానా ఆద్యంతం ఉద్విగ్నభరితంగా సాగుతుంది. ముఖ్యంగా కళ్ళకు గంతలు కట్టుకుని ఓ వ్యక్తి కత్తి చేతబట్టి.. మనిషి శరీరం, కంఠం, నుదురు, పొత్తికడుపుపై కొబ్బరికాయలు, కాయగూరలు పెట్టి నరకడం వంటి విన్యాసాల గురించి చెప్పడం కంటే చూడడం మంచి అనుభూతినిస్తుంది.  అగ్గిబరాటాలు,  కర్రసాములు, పట్టాకత్తులతో వేగంగా, ఒడుపుగా కదులుతూ యువకులు చేసే విన్యాసాల చూపరులకు ఉత్కంఠత కలిగిస్తాయి.

రెండు వందల ఏళ్ళు చరిత్ర కలిగిన ఈ ఉత్సవాలకు అప్పటి పాలకులు బ్రిటిష్ వారు సైతం అనుమతినిచ్చారు. ఇప్పటికీ ఈ ఉత్సవాలకు ఫోటోలు బ్రిటిష్ వారి దగ్గర ఉన్నట్లు పెద్దలు చెబుతుంటారు. మొదటిసారిగా తాలింఖానా ప్రదర్శన అమలాపురంలోని ఒక వీధి కొంకాపల్లిలో 1835లో ప్రారంభమైంది. అనంతరం తిలక్ స్ఫూర్తితో స్వాతంత్య్ర సమరయోధుడు అబ్బిరెడ్డి రామదాసు 1856లో ఈ విద్యకు అంకురార్పణ చేశారు. విజయదశమి ఉత్సవాల్లో భాగంగా   1856లో మహిపాలవీధిలో ఈ ప్రదర్శనలను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ చెడీతాలింఖానా ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి.

విజయదశమి రోజున కొంకాపల్లి ఏనుగు అంబారీ, లక్క హంస, రవణం వీధి మహిషాసుర మర్దని, గండువీధి శేషశయన, నల్లా వీధి శ్రీవిజయ దుర్గమ్మ వాహనం ఇలా దాదాపు 21 వాహనాలు ప్రధాన వీధుల్లో ఊరేగుతూ.. ముమ్మిడివరం గేటు వద్దకు చేరుకుంటాయి. ఈ వాహన ఊరేగింపు సమయంలో ఉండే సందడి చూడడానికి రెండు కనులు సరిపోవు అన్నట్లు ఉంటాయి. వాహనాలను బాజాభజంత్రీలు, డప్పువాయిద్యాలు, శక్తివేషధారణలు, కోయడ్యాన్సులు, బుట్టబొమ్మలు, మ్యూజికల్, తీన్‌మార్‌ బ్యాండ్‌లు, విద్యుత్‌దీపాలంకరణలతో ఊరేగిస్తారు. దశాబ్దాల చరిత్ర కల్గిన ఈ ఉత్సవాలు అలనాటి   బ్రిటిష్ పాలకులే కాదు.. ఈనాటి సినీ దర్శకులను కూడా ఆకర్షించాయి. దర్శకుడు రాజమౌళి ఈ చెడీ తాలింఖానా గురించి తెలుసుకుని మగధీర సినిమాలో వారి ప్రదర్శనలను.. అక్కడ స్థానిక యువకులను మగధీర  సినిమాలో ఉపయోగించుకున్నారు. అంతేకాదు కొంతమంది యువకులు బాలీవుడ్ లోని చరిత్ర నేపధ్య సినిమాల్లో కూడా నటించారంటే ఈ చెడీ తాలింఖానాకు ఉన్న గుర్తింపు ఖ్యాతి ఏంటో అర్థం చేసుకోవచ్చు .

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jabardasth Sai Teja: సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్‌గా మారడానికి పెద్ద యుద్ధమే చేశా.. తండ్రి అంధుడు.. చూసేవారు లేరంటూ..

Manchu Manoj-Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో మంచు మనోజ్ కీలక భేటీ.. గంటకు పైగా చర్చ

Mahesh Babu: రాజమౌళితో సినిమాపై మహేశ్ ఫుల్ క్లారిటీ.. ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్