ప్రచండ గాలులు.. ఎగసిపడుతున్న రాకాసి అలలు.. మొంథా తుఫాన్ ప్రభావమెంత? సన్నద్ధత ఎంత?
కడలి సృష్టించే కల్లోలం అత్యంత ప్రమాదకరమైంది, ఒక్కోసారి ఊహించనిది. ఇళ్లు వాకిళ్ల రూపురేఖలు ఉండవు. మహావృక్షాలే కావొచ్చు.. ఒక్కోసారి వాటి జాడలుండవ్. కరెంట్ స్తంభాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయవ్. తుఫాన్ సన్నద్ధతలో ఏ చిన్న తప్పు జరిగినా మనుషులు, పశువుల ప్రాణాలే మిగలవ్. అందుకే, తుఫాన్ అంటే నేటికీ అంత భయం.

ఇప్పటిదాకా ఎన్నో తుఫాన్లు వచ్చాయ్.. పోయాయ్. ఆంధ్రా తీరాన్ని ప్రతి ఏటా తుఫాన్లు పలకరిస్తూనే ఉన్నాయ్. అలా వచ్చిపోయే తుఫాన్లలో ఒకటేనా ఈ మొంథా. నో! అలా తేలిగ్గా చూడ్డానికి వీల్లేదీ తుఫాన్‌ను. జనరల్‌గా.. తుఫాన్ తీరానికి దగ్గరవుతున్న కొద్దీ వర్షం నిట్టనిలువునా పడుతుంటుంది. ఇంకో 40-50 కిలోమీటర్ల దూరంలో ఉందనగా.. విధ్వంసం మొదలవుతుంది. భీకర గాలులు వెంటాడతాయ్. తీరం దాటే రెండు గంటల ముందు అడుగు బయటపెట్టే పరిస్థితే ఉండదు. కనురెప్ప తెరిచి చూడలేనంత జడివాన, ప్రచండ గాలులు. దాదాపు 10, 12 గంటలు నాన్‌స్టాప్‌గా వర్షం దంచికొడుతుంది. మనిషి చేసే సహాయక చర్యలను అడ్డుకునేందుకు ప్రకృతి ప్రయత్నిస్తుంటుంది. వరద ఎట్నుంచి ముంచుకొస్తుందో తెలీదు. అందుకే, ఫ్లాష్‌ఫ్లడ్స్ అలర్ట్స్ జారీ చేశారు. దగ్గర్లోని చెరవుల కట్టలు తెగే ప్రమాదం ఉంది. వాగులు, వంకలు నదుల్లా పోటెత్తుతాయ్. మొంథా ప్రభావం కూడా దాదాపుగా ఇదే స్థాయిలో ఉంటుందని అంచనా. అందుకే, ఈ రేయి తెలవారితే చాలనుకుంటున్నారు తీర ప్రాంత ప్రజలు. ఇంతకీ మొంథా తుఫాన్ ప్రభావమెంత, సన్నద్ధత ఎంత? తెలుసుకుందాం.. కడలి సృష్టించే కల్లోలం అత్యంత ప్రమాదకరమైంది, ఒక్కోసారి ఊహించనిది. ఇళ్లు వాకిళ్ల రూపురేఖలు ఉండవు. మహావృక్షాలే కావొచ్చు.. ఒక్కోసారి వాటి జాడలుండవ్. కరెంట్ స్తంభాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయవ్. తుఫాన్ సన్నద్ధతలో ఏ చిన్న తప్పు జరిగినా మనుషులు, పశువుల ప్రాణాలే మిగలవ్. అందుకే, తుఫాన్ అంటే నేటికీ అంత భయం. బట్.....
