ఐపీఎల్-15 వ సీజన్ ప్రారంభమైంది. దీంతో కొందరు బెట్టింగ్(Betting) లకు పాల్పడుతున్నారు. డబ్బులు వస్తాయన్న ఆశతో సర్వం పోగొట్టుకుంటున్నారు. అయినా వారిలో మార్పు రావడం లేదు. సరదాగా మారిన ఈ అలవాటు వ్యసనంగా మారి కుటుంబాలనే చిత్తు చేస్తోంది. తాజాగా అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. కమ్యూనికేటర్ సహాయంతో ఈ దందాకు పాల్పడడం గమనార్హం. ఉమ్మడి అనంతపురం (Anantapur) జిల్లాలోని మడకశిర, హిందూపురం, చిలమత్తూరు, లేపాక్షి పోలీసులు క్రికెట్(Cricket) బెట్టింగ్ నిర్వహిస్తు్న్న ముఠాపై దాడులు నిర్వహించారు. ముందస్తు సమాచారంతో లేపాక్షి మండలం మల్లిరెడ్డిపల్లి వద్ద బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు తెలుసుకున్నారు. వారిపై దాడులు చేసి కొందరిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2.69 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటన గతంలో జరగగా.. బెట్టింగ్ నిర్వహణలో కీలకమైన వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి చిలమత్తూరు మండలం లాలేపల్లి సమీపంలో కమ్యూనికేటర్ సాయంతో బెట్టింగ్ చేస్తున్నట్లు సమాచారం అందింది. వెంటనే పోలీసులు దాడులు చేశారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కమ్యూనికేటర్, రూ.20 లక్షల నగదు, 16 చరవాణులు, కారును స్వాధీనం చేసుకున్నారు.
Also Read
Tree City: భాగ్యనగరానికి మరో అరుదైన గుర్తింపు.. రెండోసారి ట్రీ సిటీగా..
Gold News: సర్వేలో బయటపడ్డ షాకింగ్ నిజాలు .. దేశంలో బంగారాన్ని ఎక్కువగా కొంటోంది వారే..