రూ.20 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు 27 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేస్తే.. తక్కువ ఆదాయ వర్గం వారు 51.68 గ్రాములు.. రూ.5 నుంచి రూ.20 లక్షల ఆదాయ బ్రాకెట్‌లోని వినియోగదారులు 25.13 గ్రాములు కొనుగోలు చేసినట్లు తేలింది. ఆసక్తికరంగా, బంగారం కొనుగోలు విషయానికి వస్తే చెల్లింపు చేయడానికి నగదును ఎక్కువగా వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. 40 వేల మందిపై చేపట్టిన సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. బంగారం ధనవంతుల కోసం అనే సాధారణ ఆలోచనకు విరుద్ధంగా, మధ్య-ఆదాయ కుటుంబాలు ఎక్కువ బంగారాన్ని వినియోగిస్తున్నాయని సర్వేలో తేలినట్లు ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్ చైర్‌పర్సన్ అరవింద్ తెలిపారు. పెరుగుతున్న ఆదాయం, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బంగారం వినియోగానికి చోదక శక్తి అని, ధర కంటే ఆదాయానికి డిమాండ్ ఎక్కువగా స్పందిస్తున్నట్లు అధ్యయనంలో బయటపడింది.

బంగారాన్ని ఆస్తిగా బలోపేతం చేయడంలో మహమ్మారి చాలా ముఖ్యమైన పాత్రను పోషించింది. కరోనా కారణంగా స్టాక్ మార్కెట్లో ఏర్పడిన అస్థిరత కారణంగా బంగారం రేటు పెరుగుదలకు దారితీసింది. అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కు సంబంధించిన ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్.. గోల్డ్ & గోల్డ్ మార్కెట్స్ 2022 పేరుతో నిర్వహించిన రెండు రోజుల సదస్సులో ఈక్విటీల కంటే వైవిధ్యభరితమైన ప్రయోజనాల కారణంగా బంగారం మరోసారి సురక్షితమైన పెట్టుబడిగా నిలిచింది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Koo India: ఎలాన్ మస్క్‌కు Koo సీఈవో ట్వీట్.. అందుకు సిద్ధమన్న దేశీయ స్టార్టప్..

Travel Insurance: ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం ఎలా లెక్కిస్తారో తెలుసా..