LIC IPO: ఏప్రిల్ చివరి వారంలో ఎల్‌ఐసీ ఐపీఓ..! ప్రభుత్వ విక్రయ వాటా పెరిగే అవకాశం..
LIC, LIC IPO, Stock Market, NSE, BSE, Nifty, DRHP, Insurance Corporation of india, QIB, NII
ఎల్‌ఐసీ(LIC) ఐపీఓ(IPO) నిరీక్షణకు తెరపడే అవకాశం కనిపిస్తుంది. ఈ ఎల్‌ఐసీ ఐపీఓ ఏప్రిల్ చివరి వారంలో వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా 5 శాతం వాటా విక్రయించాలని భావించినప్పటికి.. వాటాను పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎల్‌ఐసీ ఐపీఓ మార్చిలోనే తీసుకురావాలని నిర్ణయించినప్పటికి రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా స్టాక్ మార్కెట్ల(Stock Market)పై ప్రభావం చూపడంతో ఐపీఓ తీసుకురాలేదు. ఇదే సమయంలో ఐపీఓ సైజ్ పెంచేందుకు ప్రభుత్వం చర్చలు మొదలు పెట్టింది. ఎల్‌ఐసీ ఐపీఓ సైజ్ పెంచడంపై రేపు నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మెనేజ్‌మెంట్(DIPAM) దీని గురించి మంగళవారం ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లతో చర్చించే అవకాశం ఉన్నట్లు సీఎన్‌బీసీ టీవీ18 పేర్కొంది. బ్యాంకర్ల అభిప్రాయాన్ని ప్రభుత్వం బుధవారం మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి అప్‌డేట్ చేయబడిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ లేదా DRHPని ఫైల్ చేయవచ్చు.
కేంద్ర ప్రభుత్వం తన 5 శాతం వాటాను విక్రయించడం ద్వారా దాదాపు 60,000 కోట్ల రూపాయలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మార్కెట్ రెగ్యులేటర్ నుంచి మినహాయింపు కోరకుండానే LICలో 7.5 శాతం వరకు విక్రయించవచ్చు. భారతీయ క్యాపిటల్ మార్కెట్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ కోసం పెట్టుబడిదారులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముసాయిదా పత్రం ప్రకారం సెప్టెంబర్ 31, 2022 నాటికి LIC ఎంబెడెడ్ విలువ రూ. 5.39 లక్షల కోట్లుగా లెక్కించారు.
అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల (QIB) కోసం ప్రభుత్వం LIC IPOలో దాదాపు 50 శాతం రిజర్వ్ చేసింది. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (NII), ఈ భాగం దాదాపు 15 శాతం ఉంటుంది. LIC IPO రిటైల్ కోటా ఆఫర్‌లో 35 శాతంగా నిర్ణయించారు. యాంకర్ ఇన్వెస్టర్ పోర్షన్‌లో మూడింట ఒక వంతు దేశీయ మ్యూచువల్ ఫండ్స్ కోసం రిజర్వ్ చేశారు. పాలసీదారులకు పబ్లిక్ ఇష్యూలో 10 శాతం రిజర్వ్ చేశారు. ఉద్యోగులకు కూడా LIC IPOలో 5 శాతం రిజర్వ్ చేశారు.
Read Also.. Sri Lanka Crisis: దేశ ఖజానా దివాళా.. అప్పులు తీర్చలేం.. శ్రీలంక ప్రభుత్వం సంచలన ప్రకటన!