CPI Narayana: ప్రత్యేక హోదా ఇవ్వకపోతే.. వెంకయ్య నాయుడును ఏపీలో తిరుగనివ్వంః నారాయణ
దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమాలు చేస్తుంటే హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న ఉగ్ర మూకలకు ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టే నైతిక హక్కు లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు.
CPI Narayana: దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమాలు చేస్తుంటే హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న ఉగ్ర మూకలకు ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టే నైతిక హక్కు లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. వెంకన్న దర్శనం చేసుకున్నాక వెంకయ్య నాయుడి దర్శనానికి అమిత్ షా ప్రాధాన్యత ఇచ్చారని ధ్వజమెత్తారు. మూడు రోజుల పాటు ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమత్రి అమిత్ షాను అడ్డుకునేందుకు సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. దీంతో నారాయణతో పాటు పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు చిత్తూరు జిల్లా నగరి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా టీవీ 9తో మాట్లాడిన నారాయణ.. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతుండటంతో పోలీసులు అప్రకటిత లాక్ డౌన్ ప్రకటించారని విమర్శించారు. అమిత్ షాకు నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేస్తామని ప్రకటించడంతో ముందుగా అదుపులో తీసుకొని రెండున్నర గంటలపాటు పోలీసు వాహనంలో తిప్పడం అప్రజాస్వామికమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చకుండా రాష్ట్రంలో అడుగు పెడుతున్న అమిత్ షా కు సిగ్గులేదాని నారాయణ ఫైర్ అయ్యారు.
దేశానికి ద్వితీయ పౌరుడిగా ఉన్న వెంకయ్య సూచనలను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్న నారాయణ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వెంకయ్య ఏపీలో తిరుగనివ్వమన్నారు. దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ హక్కులపై అమిత్ షా ను నిలదీయాలని నారాయణ డిమాండ్ చేశారు.