AP Panchayat Elections: కొనసాగుతున్న ఏపీ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్.. పలువురు వైసీపీ అభ్యర్థిల విజయం..!
AP Panchayat Elections: ఏపీలో గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 36 సర్పంచ్ స్థానాలు, 68 వార్డులకు కౌంటింగ్ జరుగుతోంది. రాత్రి వరకు పూర్తి..
AP Panchayat Elections: ఏపీలో గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 36 సర్పంచ్ స్థానాలు, 68 వార్డులకు కౌంటింగ్ జరుగుతోంది. రాత్రి వరకు పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే నెల్లూరు జిల్లాలో మనుబోలు మండలం వెంకన్నపాలెంలో 4వ వార్డు ఉప ఎన్నికలలో వైఎస్సార్ సీపీ బలపర్చిన వల్లూరు శకుంతలమ్మ నాలుగు ఓట్లతో విజయం సాధించారు. అలాగే అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లిలో నాలుగో వార్డు వైసీపీ అభ్యర్థి శంకరమ్మ గెలుపొందారు. రాయదుర్గం మండలం ఉడేగోళం గ్రామంలో 5వ వార్డు మెంబర్ వైసీపీ అభ్యర్థి రామలక్ష్మీ విజయం సాధించారు.
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 69 సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉండగా..30 ఏకగ్రీవం అయ్యాయి. మరో మూడు చోట్ల ఒక్క నామినేషనూ దాఖలు కాలేదు. మిగిలిన 30 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరిగింది. ఇక ఏకగ్రీవాలు పోగా మిగిలిన 68 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. దాదాపు లక్ష మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ ప్రోటాకల్ తప్పనిసరి చేశారు.
ఇవి కూడా చదవండి: