New Year Celebrations: ఈ ఫ్లై ఓవర్లు కోజ్.. రోడ్లపై కేక్ కటింగ్‌లు బంద్.. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
న్యూఇయర్ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాలు సర్వంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ముఖ్యంగా యువత డిశంబర్ 31 రాత్రిని జోష్ గా జరుపుకోవాలని ఇప్పటికే అన్ని ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. మరి కొందరైతే కోవిడ్ నేపథ్యంలో ఇంట్లోనే బంధుమిత్రుల మధ్య జరుపుకునేందుకు సిద్దమయ్యారు. ఈ తరుణంలో న్యూఇయర్ జోష్ కు బ్రేక్ వేసింది పోలీసు శాఖ. నూతన సంవత్సర వేడుకలను నిర్వహించకూడదని ఏపీ పోలీసు శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.

న్యూఇయర్ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాలు సర్వంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ముఖ్యంగా యువత డిశంబర్ 31 రాత్రిని జోష్ గా జరుపుకోవాలని ఇప్పటికే అన్ని ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. మరి కొందరైతే కోవిడ్ నేపథ్యంలో ఇంట్లోనే బంధుమిత్రుల మధ్య జరుపుకునేందుకు సిద్దమయ్యారు. ఈ తరుణంలో న్యూఇయర్ జోష్ కు బ్రేక్ వేసింది పోలీసు శాఖ. నూతన సంవత్సర వేడుకలను నిర్వహించకూడదని ఏపీ పోలీసు శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా విజయవాడ నగరంలో సెక్షన్ 30 అమలులో ఉంటుందని తెలిపింది. డిశంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు వెల్లడించింది. ఈ సమయంలో కేక్ కటింగులు చేస్తూ, కేరింతలు కొడుతూ, బైక్ రైడింగ్లు చేస్తూ రోడ్లపై గుంపులుగా తిరిగితే వారిపై కేసులు పెడతామని హెచ్చరించింది.
31వ తేదీ రాత్రి రోడ్లపైకి వచ్చి అల్లరి చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి చోటా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతామని ఆయన వెల్లడించారు. అలాగే జనవరి 1న ఎంజీ రోడ్డు, బందర్‌రోడ్డు ఫ్లై ఓవర్‌పై కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని విజయవాడ నగర సీపీ కాంతిరాణా టాటా స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా విజయవాడ నగర ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..