Andhra Pradesh: వామ్మో.. ఏం కిలేడీరా సామీ..! నకిలి నగలతో గోల్డ్ షాపులకే టోకరా.. ఎలా చేసిందో చూస్తే అవాక్కే..!!
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ బంగారం విషయంలో షాపుల యజమానులే మోసపోతుంటే సామాన్యులకు బంగారం అని ఇటువంటి నకిలీ బంగారు నగలు అమ్మితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. రూపాయి రూపాయి కూడబెట్టిన డబ్బులు పోగుచేసి బంగారం కొందామని వెళితే ఇటువంటి మోసగాళ్ళు..
ఏలూరు, డిసెంబర్ 30; బంగారం అమ్మే షాపులును టార్గెట్ చేసింది ఒక మహిళ. ఒక మహిళ కారు లో దిగుతుంది. తన దగ్గర ఉన్న పాత బంగారు నగలను మార్చి వేరే నగలు తీసుకుంటానని షాపులకు వెలుతుంది. తన దగ్గర ఉన్న బంగారు నగలను ఇచ్చి కొత్త నగలు తీసుకుని వెలుతుంది. ఇందులో ఏముంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆమె ఇచ్చిన పాత బంగారం నకిలీ బంగారం. రాగి వస్తువులపై బంగారు కోటింగ్ వేసిన నగలను తెలివిగా జ్యువెలరీ షాపుల యజమానులను మాయ చేస్తుంది.
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఒక మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. జ్యూవెలరీ షాపు లలో బంగారు పూత వేసిన ఆభరణాలను మార్చి అసలైన బంగారు నగలను తీసుకుంటున్న మహిళను షాపు యజమాని గుర్తించారు. భీమవరం, నర్సాపురం పాలకొల్లు లలో పలు బంగారు షాపులలో నగలు మార్పిడి చేస్తుంది మహిళ. మహిళ అమ్మిన నగలు కరిగించా బంగారంలో రాగి ఎక్కువగా ఉందని గుర్తించిన షాపుల యజమానులు. రాగి వస్తువులపై బంగారు పూత వేసిన నగలను షాపుల్లో ఘరానాగా అమ్మేస్తుంది. మోసపోయిన షాపు యజమానులు వాట్స్ అప్ లలో మహిళ ఫోటో, వీడియోలు షేర్ చేసుకున్నారు. ఈ మహిళ వస్తే పెట్టుకోవాలని వేచి చూస్తున్నారు. అదే సమయంలో ఆకివీడులోని ఒక జ్యూవెలరీ షాపు లో నగలు మారుస్తుండగా నిర్బందించారు. నిర్బందించిన షాపు యజమాని మోస పోయిన వారికి సమాచారం అందించాడు. తాను ఆన్లైన్ షాపింగ్ లో వస్తువులు కొని అమ్ముతున్నట్టు మహిళ చెబుతుంది. ఈ మహిళ కృష్ణా జిల్లా మచిలీపట్నం కు చెందినదిగా గుర్తించారు. మహిళ బంధువులకు సమాచారం అందించారు షాపు యజమానులు. ఈ ఘటనపై తమకు ఎలాంటి సమాచారం అందలేదంటున్నారు పోలీసులు.
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ బంగారం విషయంలో షాపుల యజమానులే మోసపోతుంటే సామాన్యులకు బంగారం అని ఇటువంటి నకిలీ బంగారు నగలు అమ్మితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. రూపాయి రూపాయి కూడబెట్టిన డబ్బులు పోగుచేసి బంగారం కొందామని వెళితే ఇటువంటి మోసగాళ్ళు వద్ద ఏం జరుగుతుందో తెలియని పరిస్తితి ఏర్పడిందని అంటున్నారు. బంగారం షాపుల యజమానుల అప్రమత్తంగా ఉండి బయట వ్యక్తుల నుండి బంగారుం కొనేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుని, పరీక్షించి తీసుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..