Pre-wedding shoot: గంగా నదిలో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్‌.. హఠాత్తుగా పెరిగిన వరద ఉధృతి.. కొత్త జంట పరిస్థితి ఎలా ఉందంటే..

ప్రీ వెడ్డింగ్‌ పేరుతో కొందరు వింత వింత విన్యాసాలు చేసిన సందర్భాలు అనేకం సోషల్ మీడియాలో చూశాం. అలాగే ప్రీ వెడ్డింగ్‌ సమయంలో కొందరు ప్రమాదాల బారినపడ్డ సంఘటనలు కూడా చూశాం..తాజాగా అలాంటి ఘటనే ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కోసం గంగా నదికి వెళ్లిన ఓ కొత్త జంటకు ఊహించిన అనుభవం ఎదురైంది..

Pre-wedding shoot: గంగా నదిలో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్‌.. హఠాత్తుగా పెరిగిన వరద ఉధృతి.. కొత్త జంట పరిస్థితి ఎలా ఉందంటే..
Pre Wedding Shoot
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 30, 2023 | 4:54 PM

ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ అనేది ఇప్పుడు కామన్‌ అయిపోయింది. కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న యువతి యువకులు చాలా మంది ఈ ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన పెళ్లి రోజును అందరూ చిరకాలం గుర్తుంచుకునేలా చేసుకోవాలని ప్లాన్‌ చేసుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ కోసం దేశ, విదేశాల్లో తమకు నచ్చిన, తమ బడ్జెట్‌కు అనుకూలమైన ప్రదేశాలను ఎంచుకుని పెళ్లికి ముందే ఫోటో షూట్‌ జరుపుకుంటున్నారు. ఇక ప్రీ వెడ్డింగ్‌ పేరుతో కొందరు వింత వింత విన్యాసాలు చేసిన సందర్భాలు అనేకం సోషల్ మీడియాలో చూశాం. అలాగే ప్రీ వెడ్డింగ్‌ సమయంలో కొందరు ప్రమాదాల బారినపడ్డ సంఘటనలు కూడా చూశాం..తాజాగా అలాంటి ఘటనే ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కోసం గంగా నదికి వెళ్లిన ఢిల్లీకి చెందిన ఓ జంట నది మధ్యలో చిక్కుకుపోయింది. హఠాత్తుగా నది ఉధృతంగా ప్రవహించటంతో ప్రవాహ ధాటికి దాదాపు కొట్టుకుపోయిన ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రిషికేశ్‌లో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో 27 ఏళ్ల మానస్ ఖేడా, 25 ఏళ్ల అంజలి అనే ఇద్దరు కాబోయే వధూవరులు గంగానదిలో ప్రీ వెడ్డింగ్‌ఫోటో షూట్‌ పెట్టుకున్నారు. గంభీరమైన గంగానది నేపథ్యంలో మరపురాని వివాహానికి ముందు ఫోటోలు తీసుకోవాలని భావించారు. ఎంతో ఆశగా గంగానదిలోకి దిగి ఫోటోలకు పోజులిస్తుండగా, ఒక్కసారిగా నీటిమట్టం పెరగడంతో నది మధ్యలో ఇరుక్కుపోయారు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది.

నదిలో మునిగిపోతున్న ఢిల్లీకి చెందిన దంపతులను రక్షించేందుకు స్థానికులు రిషికేశ్‌లోని బీసీ పోలీసు చెక్‌పోస్టు వద్ద ఉండే ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు అత్యవసర కాల్ చేశారు.. సంఘటన జరిగిన సింగ్టోలి సమీపంలోని ప్రాంతానికి రెస్క్యూ టీమ్ చేరుకునేలోపుగా వారు దాదాపు చాలా దూరం వరకు నదిలో కొట్టుకుపోవటం గమనించారు. అయితే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం స్థానికుల సాయంతో వారిని ఎట్టకేలకు బయటకు తీసి రక్షించారు. దీనిపై సమాచారం అందుకున్న ఉత్తరాఖండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) కమాండెంట్ మణికాంత్ మిశ్రా వివరాలు వెల్లడించారు. మానస్ ఖేడా నదిలో కొట్టుకుపోయిన జంటను రక్షించిన సమయంలో వారు అపస్మారక స్థితిలో ఉన్నారని చెప్పారు. దంపతులకు ప్రథమ చికిత్స అందించిన అనంతరం స్థానిక ఆస్పత్రికి తరలించామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

కోలుకున్న దంపతులు మాట్లాడుతూ.. తాము నది వద్దకు వెళ్లిన సమయంలో అక్కడ కొద్దిపాటి నీళ్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. అయితే ఇంత అకస్మాత్తుగా నీటిమట్టం పెరుగుతుందని తాము ఊహించలేకపోయామని ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందితో దంపతులు తమ అనుభవాన్ని వివరించారు. ఏది ఏమైనప్పటికీ వారివురు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..