Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Ram Mandir: ఆ శ్రీ రాముడు నడిచిన ఈ ఊరి పేరే రామడుగు..నేటికీ కనిపించే ఆనవాళ్లు.. మన తెలంగాణలోనే..

Karimagar: ఇక్కడ రాముడు అడుగులు ఉండటంతో రామడుగు అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు...రాష్ట్రం నలువైపుల నుంచి భక్తులు రాముడి పాదాలను చూసేందుకు వస్తున్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కలిగి ఉన్న రామడుగు అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉందని అంటున్నారు.. కనీసం ఇక్కడికి రావడానికి సరైన దారి కూడా లేదని వాపోతున్నారు ప్రజలు. బండ పైకి ఎక్కడం ఎంతో ష్టంగా ఉందంటున్నారు.

Ayodhya Ram Mandir: ఆ శ్రీ రాముడు నడిచిన ఈ ఊరి పేరే రామడుగు..నేటికీ కనిపించే ఆనవాళ్లు.. మన తెలంగాణలోనే..
Ramadugu
Follow us
G Sampath Kumar

| Edited By: Jyothi Gadda

Updated on: Dec 30, 2023 | 3:10 PM

కరీంనగర్, డిసెంబర్ 30; ఈ గ్రామం నుంచి ఆ రాముడు నడిచాడు..అందుకే..ఈ ఊరిని రామడుగు అని పిలుస్తారు… శ్రీరాముడు… అడుగు పెట్టిన ప్రాంతానికి ఓ విశిష్టత ఉంటుంది… ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది.. ఆయన… వెళ్లిన ప్రతి దారిలో.. ఏదో ఒక ఆనవాళ్లు ఉంటాయి… శ్రీరాముడు నడిచిన ఈ ప్రాంతంలో కూడా ఆయన అడుగులు ఇప్పటికీ కనబడుతున్నాయి.. అందుకే.. ఈ గ్రామాన్ని రామడుగుగా పిలుస్తారు..అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో ఒకసారి కరీంనగర్ జిల్లాలోని రామడుగు గ్రామం గురించి తెలుసుకుందాం…

కరీంనగర్ జిల్లా రామడుగు ప్రాచీన గ్రామం… ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది… ఈ ప్రాంతం నుంచీ.. రాముడు వనవాసం కోసం వెళ్లారు. అంతేకాదు.. ఓ గుండుపై.. రాముడు ఆడుగులు కనబడుతున్నాయి.. రాముడు.. ఇక్కడ అడుగువేయడంతో… రామడుగు అని పేరు వచ్చింది.. అంతేకాదు.. ఈ గ్రామం పక్కన ఎత్తైన కొండలు ఉన్నాయి… ఇక్కడ కొన్ని రోజుల పాటు రాముడు నివసించి తరువాత… రామగిరిఖిల్లా.. అనంతరం… భద్రచలం వైపు వెళ్లినట్లు.. చరిత్రకారులు చెబుతున్నారు.. అంతేకాదు.. ఈ రాయి చుట్టు.. శ్రీరాముడు గ్రహాలు… హనుమాన్ గ్రహాలు కూడా ఉన్నాయి.. శ్రీరాముడి పాదం రెండు ఫీట్ల వరకు ఉంది..

ఇప్పుడు అయోధ్యలో రామమందిరం నిర్మాణం కావడంతో… ఇక్కడ.. రాముడు అడుగుల గురించి చర్చించుకుంటున్నారు.. రాముడి ఆడుగులు చూడటానికి.. భక్తులు పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారు.. శ్రీరామ నవ రోజు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.. తమ ప్రాంతం నుంచే రాముడు వెళ్లడంతో ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు స్థానికులు.. ఇతర గ్రామాల నుండి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడి వచ్చి రాముడి పాదాలు చూసి వెళుతున్నారని చెబుతున్నారు.. ఇప్పుడు.. ఆధ్యాత్మిక గ్రామం గురించే చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా… ఇక్కడ శిల్పులు అధిక సంఖ్యలో ఉన్నారు. వివిధ రకాల శిల్పాలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు.. తాము కూడా అయోధ్య వెళ్ళి రామమందిరం చూస్తామని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ రాముడు అడుగులు ఉండటంతో రామడుగు అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు…రాష్ట్రం నలువైపుల నుంచి భక్తులు రాముడి పాదాలను చూసేందుకు వస్తున్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కలిగి ఉన్న రామడుగు అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉందని అంటున్నారు.. కనీసం ఇక్కడికి రావడానికి సరైన దారి కూడా లేదని వాపోతున్నారు ప్రజలు. బండ పైకి ఎక్కడం ఎంతో ష్టంగా ఉందంటున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..