Andhra Pradesh: చలితో గజగజ వణికిపోతున్న గిరిజనం.. పొగమంచు కారణంగా రోగాల బారిన పడుతున్న మన్యంవాసులు

Vizianagaram: చర్మం పొడిబారి పోవడం వల్ల దురదలు రావడం, ఆ దురదలు గోకడం వల్ల చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్ రావటం జరుగుతుంది. అంతేకాకుండా సోరియాసిస్, ఇతియోసిస్ వంటి వ్యాధులు కూడా ఉధృతం అవుతాయి. సోరియాసిస్ సోకిన వారి చర్మం నుండి పొట్టు రాలడం జరుగుతుంది. ఇతియోసిస్ సోకినవారి చర్మం పొలుసు బారిపోతుంది. అలాగే ఉపరితిత్తుల సమస్యలైన సైనసైటిస్, ఆస్తమా, న్యుమోనియా, టాన్సిల్స్ ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు డాక్టర్లు.

Andhra Pradesh: చలితో గజగజ వణికిపోతున్న గిరిజనం.. పొగమంచు కారణంగా రోగాల బారిన పడుతున్న మన్యంవాసులు
Cold
Follow us
G Koteswara Rao

| Edited By: Jyothi Gadda

Updated on: Dec 29, 2023 | 8:45 PM

విజయనగరం, డిసెంబర్ 29; సడెన్ గా పెరిగిన చలిగాలుల కారణంగా పల్లెల నుండి పట్టణాల వరకు నానా అవస్థలు పడుతున్నారు. ఇక కొండల పై, అటవీ ప్రాంతానికి సమీపంలో నివసిస్తున్న వారి పరిస్థితి అయితే మరి చెప్పక్కర్లేదు. చలిగాలికి ఇంట్లో నుండి బయటకు రావాలంటే నరకం కనిపిస్తుంది. సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమవుతున్న పొగమంచుతో కూడిన చలిగాలి ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంటుంది. దీంతో ఇంటి నుండి బయటకు రావడానికి అవస్థలు పడుతున్నారు జిల్లా వాసులు. పొలాలకు వెళ్లే రైతులు, స్కూలుకు వెళ్లే విద్యార్థులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలు కష్టంగా మారి రోడ్ల ప్రక్కనే వాహనాలు పెట్టుకొని రాత్రంతా గడుపుతున్నారు. రోజు మొత్తంలో ఎక్కువ సమయం పొగమంచు, చలిలోనే గడపుతున్నారు జిల్లా వాసులు. పొగమంచు అధికంగా ఉండటంతో ఏజెన్సీవాసులు రోగాల బారిన పడుతున్నారు. ప్రధానంగా చలికాలంలో ఊపిరితిత్తులు, చర్మ మరియు గొంతు సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఆస్తమా, న్యుమోనియా వంటి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఇప్పుడు పొగమంచు కారణంగా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్దులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ చలి కాలంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మరింత ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు వైద్యులు. చలిలో ఎక్కువగా తిరగటం చేయొద్దని, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటకు వస్తే మంచిదని అంటున్నారు. ఒక వేళ బయటకు వెళ్లాల్సి వస్తే రక్షణగా చలికోట్లు లేదా ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు

చర్మ వ్యాధులు, ఉపరితిత్తుల సమస్యలు తలెత్తే ప్రమాదం

చలికాలంలో సహజంగా చర్మం పొడిబారిపోవడం, పాదాలు పగిలిపోవడం, దంతాల పగుళ్ల నుండి రక్తం కారటం వంటి ఆరోగ్య సమస్యలు కొత్తగా ఉద్భవిస్తుంటాయి. చర్మం పొడిబారి పోవడం వల్ల దురదలు రావడం, ఆ దురదలు గోకడం వల్ల చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్ రావటం జరుగుతుంది. అంతేకాకుండా సోరియాసిస్, ఇతియోసిస్ వంటి వ్యాధులు కూడా ఉధృతం అవుతాయి. సోరియాసిస్ సోకిన వారి చర్మం నుండి పొట్టు రాలడం జరుగుతుంది. ఇతియోసిస్ సోకినవారి చర్మం పొలుసు బారిపోతుంది. అలాగే ఉపరితిత్తుల సమస్యలైన సైనసైటిస్, ఆస్తమా, న్యుమోనియా, టాన్సిల్స్ ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు డాక్టర్లు. ఈ కాలంలో అలాంటి ఉపరితిత్తుల సమస్యలు ఉన్నవారికి తరుచూ ముక్కు నుండి నీరు కారడం, దగ్గు, కఫం, జ్వరం, తలనొప్పి వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. చలికాలంలో కొందరు భక్తులు అనేక రకాల మాలాధారణలు వేస్తూ రెండు పూటలా తల స్నానాలు చేస్తుంటారు. అలా చల్లని నీటితో స్నానం చేయడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

చలికాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

సాయంత్రం ఆరు నుండి ఉదయం ఏడు గంటల వరకు బయట తిరగకూడదు. కూల్ వాటర్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ వంటివి తినకూడదు, త్రాగకూడదు. స్నానం చేసేటప్పుడు చెవిలో నీరు వెళ్లకుండా దూది పెట్టుకోవాలి. గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. చర్మం పొడిబారకుండా శరీరానికి తేమ ఉండేలా సంభందిత ఆయిల్స్ లేదా లోషన్స్ రాయాలి అని చెప్తున్నారు చర్మవ్యాధుల నిపుణులు. ఏ మాత్రం ఆరోగ్య సమస్య తలెత్తినా నిర్లక్యం చేయకుండా అందుబాటులో ఉన్న వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..