YS Jagan: సీఎం జగన్ మార్క్ వ్యూహం.. పలువురు ఎమ్మెల్యేలకు తాడేపల్లి రావాలని పిలుపు.. ఆ తర్వాతే..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమరానికి రెడీ అవుతున్న అధికార వైసీపీ.. వై నాట్ 175 టార్గెట్‌గా పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ముందుగా వైసీపీ ఇన్‌చార్జ్‌ల మార్పుపై ఫోకస్ పెట్టిన వైసీపీ అధినేత సీఎం జగన్.. జిల్లాల వారీగా కసరత్తు కంప్లీట్ చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకాస్తా టైమ్ ఉన్నప్పటికీ.. ఇదే దూకుడుతో ముందుకెళ్లాలని వ్యూహాలను రచిస్తున్నారు. ఇప్పటికే 11 మంది ఇన్‌చార్జ్‌లను మార్చిన పార్టీ అధినేత..

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమరానికి రెడీ అవుతున్న అధికార వైసీపీ.. వై నాట్ 175 టార్గెట్‌గా పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ముందుగా వైసీపీ ఇన్‌చార్జ్‌ల మార్పుపై ఫోకస్ పెట్టిన వైసీపీ అధినేత సీఎం జగన్.. జిల్లాల వారీగా కసరత్తు కంప్లీట్ చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకాస్తా టైమ్ ఉన్నప్పటికీ.. ఇదే దూకుడుతో ముందుకెళ్లాలని వ్యూహాలను రచిస్తున్నారు. ఇప్పటికే 11 మంది ఇన్‌చార్జ్‌లను మార్చిన పార్టీ అధినేత.. మరో 50, 60 స్థానాల్లోనూ మార్చాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే కసరత్తులు చేస్తున్నారు. అయితే మలి విడత జాబితా ఇవాళో, రేపో ప్రకటించే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ.. సీఎం జగన్ కొత్త సంవత్సరంలో ఈ మార్పులు చేపట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. జనవరి 2వ తేదీన మలి విడత జాబితాను ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం. రీజినల్ కోఆర్డినేటర్లు, MLAలతో మరోసారి చర్చించి ఫైనల్‌గా జాబితా రూపొందించాలని సీఎం జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా శనివారం పలువురు రీజినల్ కో ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలను తాడేపల్లి రావాలని జగన్ నుంచి పిలుపుఅందింది. పలు స్థానాల్లో ఇంచార్జీల మార్పులపై సీఎం జగన్ మరోసారి అభిప్రాయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయా రీజినల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ విడివిడిగా సమావేశం అయి.. సమాచారాన్ని సేకరించనున్నారు. ఆ తర్వాత తుది నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పలు నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలను ఖరారు చేసిన సీఎం జగన్.. అప్పటినుంచి ఇతర స్థానాలపైనా కసరత్తు చేస్తున్నారు. కొంతమందిని వేరే చోటకు పంపి.. మరికొందరికి సీటు ఇవ్వకుండా కొత్తవారికి ఛాన్స్ ఇస్తున్నారు. తాజాగా.. సుమారు 50, 60 స్థానాలకు సంబంధించి సీఎం జగన్ క్లారిటీకి వచ్చినట్లు వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతుండటంతో.. పలువురు అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. మొదటి విడతలో 11 స్థానాల్లో అభ్యర్థులను మార్చిన జగన్.. ఒకట్రెండు జిల్లాలు మినహా.. మిగిలిన అన్ని జిల్లాలకు సంబంధించిన మార్పులు-చేర్పులపై కసరత్తు కంప్లీట్ చేశారంటూ వార్తలొచ్చాయి. అందులోనూ.. 35 స్థానాలపై క్లారిటీ రావడంతో.. ఏ క్షణమైనా రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే.. మరోసారి కోఆర్టినేటర్లతో చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకోవాలని పార్టీ అధినేత సీఎం జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల మార్పులు- చేర్పులపై నేతల అభిప్రాయాలు తీసుకుని ఇన్‌ఛార్జ్‌లను ఖరారు చేయనున్నారు. అభిప్రాయాల సేకరణ అనంతరం ఏ క్షణమైనా వైసీపీ ఇన్‌చార్జుల రెండో లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
