Viral Video: ఇండిగో విమానంలో మహిళకు చేధు అనుభవం.. శాండ్ విచ్‌లో బతికున్న పురుగు!
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ మరోసారి వివాదంలో ఇరుక్కుని వార్తల్లో నిలిచింది. ఎయిర్ ఇండియా విమానంలో అందించిన భోజనంపై ఓ ప్రయాణికులు రాలు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీకి చెందిన డైటీషియన్ ఖుష్బూ గుప్తా ఇటీవల ఇండిగో విమానంలో ప్రయాణించారు. తనకు అందించిన శాండ్ విచ్‌లో బతికి ఉన్న పురుగు రావడంతో షాక్ అయింది. ఈ విషయాన్ని ఖుష్బూ గుప్తా తన అధికారిక ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన..
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ మరోసారి వివాదంలో ఇరుక్కుని వార్తల్లో నిలిచింది. ఎయిర్ ఇండియా విమానంలో అందించిన భోజనంపై ఓ ప్రయాణికులు రాలు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీకి చెందిన డైటీషియన్ ఖుష్బూ గుప్తా ఇటీవల ఇండిగో విమానంలో ప్రయాణించారు. తనకు అందించిన శాండ్ విచ్‌లో బతికి ఉన్న పురుగు రావడంతో షాక్ అయింది. ఈ విషయాన్ని ఖుష్బూ గుప్తా తన అధికారిక ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే..
ఢిల్లీకి చెందిన ఖుష్బూ గుప్తా డిసెంబర్ 29వ తేదీన ఢిల్లీ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో బయలు దేరారు. ఈ ప్రయాణంలో ఆమె ముందస్తుగానే వెజ్ శాండ్ విచ్‌ను ఆర్డర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె విమానంలో ప్రయణిస్తున్నప్పుడు వెజ్ శాండ్ విచ్‌ను ఇండిగో సిబ్బంది సర్వ్ చేశారు.
తీరా శాండ్ విచ్ చూసే సరికి అందులో బతికి ఉన్న పురుగు ప్రత్యక్షం అవడంతో ఖష్బూ గుప్తా షాక్ తింది. ఈ విషయాన్ని సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా.. సరిగా పట్టించుకోకపోవడంతో.. ఆ విషయాన్ని బాధతో ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. శాండ్ విచ్ గురించి చెప్తున్నా ఇండిగో సిబ్బంది పట్టించుకోకుండా.. శాండ్ విచ్‌ని పిల్లలకు, వృద్ధులకు ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. దీంతో ఈ విషయం కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. వారికి అనుభవించిన చేధు అనుభవాలను పంచుకున్నారు.
ఈ వీడియో కాస్తా.. ఇండిగో విమాన సంస్థ దృష్టికి చేరడంతో.. ఒక ప్రకటనలో సదరు మహిళకు క్షమాపణలు చెప్పింది సంస్థ. ప్రస్తుతం ఈ విషయం విచారణలో ఉందని వివరించింది. ఆహార విషయంలో మరింతగా శ్రద్ధ తీసుకుంటామని వెల్లడించింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని.. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని వివరించింది ఇండిగో సంస్థ.
View this post on Instagram