AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రౌడీ‌షీట్ ఎత్తివేయించేందుకు కోర్టు కానిస్టేబుల్ భలే ఫ్లాన్.. ఏకంగా చనిపోయిన వ్యక్తినే..!

పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పాదర్తి రమేష్ అనే మరొక వ్యక్తి నివసిస్తుంటాడు. పలు క్రిమినల్ కేసులు ఉండటంతో రమేష్‌పై అదే పీఎస్ పరిధిలో రౌడీ షీట్ ఓపెన్ చేశారు.

రౌడీ‌షీట్ ఎత్తివేయించేందుకు కోర్టు కానిస్టేబుల్ భలే ఫ్లాన్.. ఏకంగా చనిపోయిన వ్యక్తినే..!
Police
T Nagaraju
| Edited By: Balaraju Goud|

Updated on: Oct 27, 2024 | 3:17 PM

Share

వాళ్లిద్దరి పేర్లు ఒకటే. అయితే ఒకరు రాజకీయ నేత అయితే, మరొకరు రౌడీ షీటర్.. ఇద్దరిదీ ఒకే నగరం. అయితే రాజకీయ నేత అనారోగ్య కారణాలతో మృత్యువాత పడితే, రౌడీషీటర్‌కు కలిసొచ్చింది. అలా కలిసొచ్చేలా చేసింది ఒక కోర్టు కానిస్టేబుల్. చనిపోయిన రాజకీయ నాయకుడి డెత్ సర్టిఫికేట్ ఉపయోగించుకుని రౌడీ షీట్ ఎత్తి వేయించాడు. అయితే ఈ మోసం ఎక్కువ కాలం దాగలేదు. కొద్దీ రోజులకే బయటపడటం ఇప్పుడు కలకలం రేపుతోంది.

ఆయన పేరు పాదర్తి రమేష్. గుంటూరు నగర వాసులకు చిరపరిచితమైనే పేరు. వైసీపీ తరుఫున కార్పొరేటర్‌గా గెలిచి మేయర్ పదవికి కూడా పోటీ పడ్డారు. అయితే కార్పొరేటర్‌గా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే అనారోగ్య కారణాలతో చనిపోయారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది. అయితే ఆయన చనిపోయిన తర్వాతే కోర్టు కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించారు. పోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి అదే పేరున్న వ్యక్తిపై రౌడీ షీట్ ఎత్తివేయించాడొక కోర్టు కానిస్టేబుల్. దీంతో విషయం బయటపడటంతో విచారణ చేపట్టారు ఉన్నతాధికారులు.

పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పాదర్తి రమేష్ అనే మరొక వ్యక్తి నివసిస్తుంటాడు. పలు క్రిమినల్ కేసులు ఉండటంతో రమేష్‌పై అదే పీఎస్ పరిధిలో రౌడీ షీట్ ఓపెన్ చేశారు. కారసాని శ్రీను, నల్లపాటి శివయ్య అనే ఇద్దరూ రౌడీ షీటర్ల మధ్య గతంలో ముఠా తగాదాలు ఉండేవి. ఈ క్రమంలోనే కారసాని శ్రీనును, మల్లాది శివయ్య హత్య చేయించాడు. కారసాని శ్రీను హత్య కేసులో పాదర్తి రమేష్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. శివయ్య అనుచరుడిగా ఉంటే రమేష్‌పై అనేక క్రిమినల్ కేసులున్నాయి. ఆ తర్వాత శివయ్య, రమేష్ మధ్య కూడా విబేధాలు వచ్చాయి.

అయితే కోర్టు కానిస్టేబుల్ రౌడీ షీటర్ పాదర్తి రమేష్‌తో కుమ్మక్కై చనిపోయిన కార్పొరేటర్ డెత్ సర్టిఫికేట్‌ను పోర్జరీ చేసి అతనిపై ఉన్న రౌడీ షీట్ ను తొలగించాడు. కేసులున్న వ్యక్తులు చనిపోతే వారి డెత్ సర్టిఫికేట్ ఆధారంగా వారిపై ఉన్న కేసులను తొలగిస్తారు. దీన్ని ఆసరగా చేసుకున్న కోర్టు కానిస్టేబుల్, కార్పొరేటర్ డెత్ సర్టిఫికేట్ ను పోర్జరీ చేసి రౌడీ షీట్ ఎత్తి వేయించాడు. అంతేకాకుండా రమేష్ పై ఉన్న ఇతర క్రిమినల్ కేసులను తొలగించాడు.

కొద్దీ రోజుల తర్వాత ఈ విషయం బయటకు పొక్కింది. కార్పొరేటర్ చనిపోతే అతని డాక్యుమెంట్స్ పోర్జరీ చేసి రౌడీ షీట్ ఎత్తివేయించినట్లు ప్రచారం జరగడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. గత వారంలో గుంటూరు కోర్టులో ఒక వ్యక్తికి బదులు మరొకరు హాజరైన క్రమంలో జడ్జి ఈ విషయాన్ని పసిగట్టి సదరు వ్యక్తిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ ఘటన మరువక ముందే అటువంటి తరహాలో మరొక కేసు బయట పడటంతో కలకలం రేగింది. వీటిపై జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..