Andhra Pradesh: గుడిలో పెళ్లి చేసుకున్న ప్రేమ జంట.. ఆ తర్వాత, గడియ పెట్టుకొని..

ఇద్దరూ సచివాలయ ఉద్యోగులు.. కులాలు వేరైనా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు.. చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. ఊరిలోని రామాలయంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. అంతా బాగానే ఉంది కానీ.. కులాంతర వివాహం చేసుకోవడంతో పెద్దలు ఏమైనా చేస్తారేమోనన్న భయంతో పెళ్లి చేసుకున్న గుడిలోనే దాక్కున్నారు.

Follow us
Shaik Madar Saheb

| Edited By: Ravi Kiran

Updated on: May 02, 2023 | 10:35 AM

ఇద్దరూ సచివాలయ ఉద్యోగులు.. కులాలు వేరైనా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు.. చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. ఊరిలోని రామాలయంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. అంతా బాగానే ఉంది కానీ.. కులాంతర వివాహం చేసుకోవడంతో పెద్దలు ఏమైనా చేస్తారేమోనన్న భయంతో పెళ్లి చేసుకున్న గుడిలోనే దాక్కున్నారు. ఆలయంలోనే గడియ పెట్టుకుని ప్రేమ జంట ఉండిపోయిన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది.

బుద్దాలపాలెం రామాలయంలో పెళ్ళి చేసుకున్న సచివాలయ ఉద్యోగులు.. గడియ పెట్టుకుని ఆలయంలోనే ఉండిపోయారు. కులాంతర వివాహం చేసుకొని పెద్దలకు భయపడుతూ గుడికి పరిమితమయ్యారని స్థానికులు తెలిపారు. తల్లితండ్రులు వారి ప్రేమను అంగీకరించరని.. ఏదైనా చేస్తారని భయంతో ప్రేమ జంట గుడిలోంచి బయటకురాలేదని పేర్కొన్నారు. ఆ తర్వాత భయంతో ప్రేమికులు పోలీసులకు ఫోన్ చేశారు.

తాము కులాంతర వివాహం చేసుకున్నామని.. కుటుంబ సభ్యుల నుంచి ప్రమాదం పొంచి ఉందంటూ యువతీ, యువకుడు పోలీసు రక్షణ కోరారు. ప్రేమికుల విషయం తెలుసుకుని పోలీసులు.. అక్కడికి చేరుకుని ప్రేమికులతో మాట్లాడారు. రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వటంతో ప్రేమ జంట బయటకు వచ్చారు.

కాగా.. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రేమికులిద్దరూ సచివాలయ ఉద్యోగులని.. కులాంతర వివాహం చేసుకుని.. ఆ తర్వాత భయంతో గుడిలో గడి పెట్టుకుని ఉండిపోయారని పోలీసులు తెలిపారు. వారికి రక్షణ కల్పిస్తామని.. ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ సైతం ఇస్తామని తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..