AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather:ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్‌.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు.. లేటెస్ట్‌ వెదర్‌ రిపోర్ట్‌ ఇదే

మండు వేసవిలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. అది కూడా రెయిన్ సీజన్‌ను తలపించేలా.. ఈదురుగాలు, ఉరుములు, పిడుగులతో అల్లాడిస్తున్నాయి. ఈ పరిస్థితి మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది. ప్రస్తుతం విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ,కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతోంది.

AP Weather:ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్‌.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు.. లేటెస్ట్‌ వెదర్‌ రిపోర్ట్‌ ఇదే
Andhra Weather Report
Basha Shek
|

Updated on: May 02, 2023 | 7:00 AM

Share

మండు వేసవిలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. అది కూడా రెయిన్ సీజన్‌ను తలపించేలా.. ఈదురుగాలు, ఉరుములు, పిడుగులతో అల్లాడిస్తున్నాయి. ఈ పరిస్థితి మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది. ప్రస్తుతం విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ,కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ (మే2) అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇవాళ మన్యం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. అలాగే పశ్చిమగోదావరి, ఏలూరు, సత్యసాయి,అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. కాగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, కూలీలు,గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలి. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద అసలు ఉండవద్దని విపత్తుల సంస్థ హెచ్చరించింది.

కాగా ఏపీలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. భారీ వర్షాలతో చేతికందిన పంట వానపాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఉరుములు మెరుపులతో వాన, శ్రీశైల మల్లన్న దగ్గర వీధులన్నీ జలమయమయ్యాయి. ఇక తెలంగాణలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో అయితే కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?