AP Corana: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 839 మందికి పాజిటివ్..
AP Corana: కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓవైపు ఒమిక్రాన్ మరో వైపు డెల్టా కేసులు
AP Corana: కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓవైపు ఒమిక్రాన్ మరో వైపు డెల్టా కేసులు నమోదవుతున్నాయి. దీంతో మరోసారి భయాందోళనలు నెలకొనే పరిస్థితులు వచ్చాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా కేసులు ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో అనూహ్యంగా కోవిడ్ కేసులు పెరిగాయి. శనివారం కొత్తగా 839 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి.. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. తాజాగా.. మరో 150 మంది బాధితులు మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. గడిచిన 24గంటల్లో 37,553 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,659 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు భయాందోళనలను గురి చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2వేల మార్కును దాటేశాయి. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 2,606 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరుసగా రెండు వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇది రెండో రోజు. వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వివరాల ప్రకారం 24 గంటల్లో 285 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ సంఖ్య 6,92,357కు పెరిగింది. ఇందులో 6,76,136 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ కారణంగా మొత్తం 4,041 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.