Congress Party: ఏపీలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ దృష్టి.. జనవరిలో ఈ ప్రాంతాల్లో బహిరంగసభలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనానంతరం సుదీర్ఘ కాలం తరువాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇదే ఉత్సాహంతో ఏపీలోనూ తన బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం భవిష్యత్ కార్యాచరణను రూపొందించింది ఏఐసీసీ అధిష్టానం. ఈరోజు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏపీ కాంగ్రెస్ సమన్వయ భేటీ జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనానంతరం సుదీర్ఘ కాలం తరువాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇదే ఉత్సాహంతో ఏపీలోనూ తన బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం భవిష్యత్ కార్యాచరణను రూపొందించింది ఏఐసీసీ అధిష్టానం. ఈరోజు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏపీ కాంగ్రెస్ సమన్వయ భేటీ జరిగింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మాణిక్కం ఠాగూర్, ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి, సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సమావేశం సందర్బంగా ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సిద్దం అవ్వాలని దానికి అనుసరించాల్సిన వ్యూహాలు, పొత్తులు, చేరికలు, పార్టీ బలోపేతం, కాంగ్రెస్ గ్యారెంటీలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అలాగే, ఏపీ కాంగ్రెస్ యాక్టీవిటీ రిపోర్టును అధిష్టానానికి అందించారు రుద్రరాజు. పీసీసీగా ఏడాది కాలంలో చేసిన కార్యక్రమాలకు సంబంధించిన 700 పేజీల యాక్టీవిటీ రిపోర్ట్‌ను రుద్రరాజు సిద్ధం చేశారు. ఇదిలా ఉంటే నూతన సంవత్సరం నుంచి కాంగ్రెస్ శ్రేణుల్లో, కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపడం కోసం ప్రణాళికలు సిద్దం చేసింది.
అందులో భాగంగానే జనవరిలో పండుగ తరువాత అంధ్రప్రదేశ్లో మూడు సభలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక వాధ్రాలను రుద్రరాజు ఆహ్వానించారు. సంక్రాంతి తరువాత ఏఏ ప్రాంతాల్లో సభలు నిర్వహించాలన్న దానిపై ఒక నిర్ణయానికి వచ్చారు. హిందూపురంలో ఖర్గే, విశాఖపట్నంలో రాహుల్ గాంధీ, అమరావతిలో ప్రియాంక గాంధీ సభలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమరావతి, ఉత్తరాంధ్ర, రాయలసీమలను కవర్ చేసేలా ఈ సభలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం కోసమే రెండు రోజుల క్రితం ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటి సభ్యులను ఢిల్లీకి రావాలని పిలిపించింది కాంగ్రెస్ అధిష్టానం.
మరిన్ని అంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..