AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: ‘ఆర్జీవీ తలతెస్తే రూ.కోటి’.. కేసు నమోదు చేసిన పోలీసులు

 ‘వ్యూహం’ సినిమా విడుదలపై హైదరాబాద్‌ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చిత్రాన్ని ఓటీటీ, ఆన్‌లైన్‌, ఇంటర్నెట్ వేదికల్లో ఎక్కడా విడుదల చేయొద్దని ఆదేశించింది. ఈ మేరకు రామదూత క్రియోషన్స్‌, దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది. వ్యూహం సినిమాపై టీడీపీ నేతలు హైదరాబాద్‌ సిటీసివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ చిత్రానికి ఇచ్చిన సెన్సార్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరారు..

Ram Gopal Varma: 'ఆర్జీవీ తలతెస్తే రూ.కోటి'.. కేసు నమోదు చేసిన పోలీసులు
Ramgopalvarma
Subhash Goud
| Edited By: Ram Naramaneni|

Updated on: Dec 27, 2023 | 2:35 PM

Share

దర్శకుడు రాంగోపాల్‌వర్మ రూపొందించిన ‘వ్యూహం’ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రచ్చ కొనసాగుతోంది. వ్యూహం సినిమాను ఆపాలంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలు, ఆందోళనలు కొనసాగుతుండగా, హైదరాబాద్‌లో వర్మ కార్యాలయం ఎదుట టెన్షన్ వాతావరణం నెలకొంది. వ్యూహం సినిమాకు వ్యతిరేకంగా కొంతమంది ఆందోళనకు దిగారు. వ్యూహం మూవీ పోస్టర్లను తగలబెట్టారు. సినిమా బ్యాన్ చేయాలని నినదించారు. సమాచారం అందుకున్న పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారుల్ని చెదరగొటారు కూడా. నిజానికి ఆర్జీవీ వ్యూహం మూవీపై సెన్సార్‌ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బెంగళూరులోని రివైజ్ కమిటీకి సిఫార్సు చేసింది. బెంగళూరులో వ్యూహాం మూవీకి క్లీన్ యూ సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఆఫీస్‌ ఎదుట ఆందోళన జరిగింది. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మూవీ సమయంలోనే ఆర్జీవీకి తగినశాస్తి జరగాల్సిందని మండిపడ్డారు ఆందోళనకారులు. చంద్రబాబు ఫ్యామిలీ టార్గెట్‌గా ఆర్జీవీ సినిమాలు తీస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

‘వ్యూహం’ సినిమా విడుదలపై హైదరాబాద్‌ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చిత్రాన్ని ఓటీటీ, ఆన్‌లైన్‌, ఇంటర్నెట్ వేదికల్లో ఎక్కడా విడుదల చేయొద్దని ఆదేశించింది. ఈ మేరకు రామదూత క్రియోషన్స్‌, దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. వ్యూహం సినిమాపై టీడీపీ నేతలు హైదరాబాద్‌ సిటీసివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ చిత్రానికి ఇచ్చిన సెన్సార్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ కార్యాలయం, రివైజింగ్ కమిటీ, రామదూత క్రియేషన్స్‌, నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్, దర్శకుడు రాంగోపాల్‌ వర్మలను ప్రతివాదులుగా చేర్చారు. చిత్రం విడుదల కాకుండా నిర్మాతను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సినిమా వల్ల చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలగడంతో పాటు పార్టీ గౌరవం దెబ్బతింటోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే వర్మ తీసే సినిమాలన్ని రాజకీయ కోణంలో ఉండటంతో ఎప్పుడూ కూడా వివాదస్పదంగా మారుతుంటాయి. ఎన్నికల సీజన్ వస్తే చాలు ఆర్జీవీ సినిమాలు వరుసపెట్టి బయటకు వస్తుంటాయి. ఆర్జీవి తీసే సినిమాలు ఎప్పుడూ కూడా కాంట్రవర్సిగా మారుతుటాయి. ఇదిలా ఉండగా, ఈ మూవీ నవంబర్ 10న విడుదుల కావాల్సి ఉండగా, కోర్టు వివాదాలలో చిక్కుకుంది. ఇటీవల ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ఆర్జీవీ విజయవాడలో నిర్వహించారు. ఈ నెల 29న ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తే టీడీపీ నేత నారా లోకేష్ కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు ఈ కేసు విచారణలో ఉంది.ఈ నెల 28కి ఈ కేసు వాయిదా పడింది. ఇదిలా ఉంటే వర్మ కార్యాలయం వద్ద సోమవారం రాత్రి కొందరు టీడీపీ కార్యకర్తలు వెళ్లి నిరసన తెలియచేశారు.

దుమారం రేపుతున్న శ్రీనివాసరావు వ్యాఖ్యలు

ఈ నేపథ్యంలో ఈ వ్యూహం సినిమాపై టీవీ చానళ్ళలో డిబేట్ కూడా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఒక టీవీ చానల్లో నిర్వహించిన డిబెట్‌లో అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు రాంగోపాల్ వర్మ తల తెస్తే కోటి రూపాయలు నజరానాగా ఇస్తానని ప్రకటించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే సదరు యాంకర్‌ అలాంటి మాటలు వద్దని, విత్‌డ్రా చేసుకోవాలని చెప్పినా శ్రీణివాసరావు వినిపించుకోలేదు. నాకు సమాజం కంటే ఏదీ ఎక్కువ కాదు.. అంటూ ఈ వ్యాఖ్యలు పదేపదే చేశారు. శ్రీనివాసరావు వ్యాఖ్యలపై వర్మ స్పందించారు. కొలికపూడి శ్రీనివాసరావు చేసిన ఈ వ్యాఖ్యలనే తన ఫిర్యాదుగా అధికారికంగా తీసుకోవాలని ఆ వీడియో బైట్ ని ట్యాగ్ చేసి మరీ ఆర్జీవీ ఏపీ పోలీసులకు పంపించారు. అలాగే శ్రీనివాసరావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!