Viral: పనుల్లో నిమగ్నమైన ఉద్యోగులు.. దూసుకొచ్చిన అనుకోని అతిధి.. దెబ్బకు గుండె గుభేల్!
సరీసృపాలు తమ ఆవాసాలను వదిలేసి.. జనావాసాల్లోకి వస్తున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో చాలానే చూస్తున్నాం..

Andhra Pradesh
సరీసృపాలు తమ ఆవాసాలను వదిలేసి.. జనావాసాల్లోకి వస్తున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో చాలానే చూస్తున్నాం. అసలే ఇప్పుడు ఎండాకాలం కావడంతో.. పాములు జనాల మధ్యకు వచ్చి కలకలం రేపుతున్నాయి. అలాంటి ఘటనే ఒకటి తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సత్యసాయి జిల్లా పెనుకొండలోని రొద్దం మండల తహశీల్దార్ కార్యాలయంలోకి దూరి ఓ నాగుపాము స్థానికంగా కలకలం రేపింది. ఎండవేడికి తట్టుకోలేని ఈ విషసర్పం.. కార్యాలయంలోకి వచ్చి ఎంచక్కా సేద తీరింది. ఇక ఈ నాగుపామును చూసేందుకు భారీగా స్థానికులు తరలివచ్చారు. అనంతరం రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని నాగుపామును సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు.
ఇవి కూడా చదవండి

AC: ఏసీ కొనే ప్లాన్లో ఉన్నారా.? అయితే ఇలా చేస్తే డబ్బులు తగ్గుతాయ్!

Tollywood: కష్టాలు ఎదురైన చెరగని చిరునవ్వు ఈమె సొంతం.. ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?

Viral: స్కూల్లో వాష్రూమ్ డోర్ ఓపెన్ చేయగా ఊహించని షాక్.. అక్కడ సీన్ చూసి గుండె గుభేల్!

Business Ideas: ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టండి.. నెలకు రూ. 70 వేలు గ్యారంటీ!
