Vijayawada: ఏం మైండ్ రా మీది.. ఆరుగురిని చంపారు.. అయినా ఒక్క ఫిర్యాదు లేదు.. కట్ చేస్తే..
పగలు రెక్కీ.. రాత్రిమర్డర్.. కత్తిపోటు పడదు.. నెత్తురు చుక్క కానరాదు.. గాయాలుండవు.. మర్డర్ అనే అనుమానం అసలే రాదు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు హత్యలు, 20 కి పైగా నేరాలు.. ఐదుగురు ఐదుగురు సభ్యులు.. మొత్తం 22 ఏళ్ళ లోపు వారే.. బంగారం, డబ్బు కోసం జరిగిన ఈ కిరాతక హత్యల్లో ఎట్టకేలకు నిందితులకు జీవిత ఖైదు పడింది.
పగలు రెక్కీ.. రాత్రిమర్డర్.. కత్తిపోటు పడదు.. నెత్తురు చుక్క కానరాదు.. గాయాలుండవు.. మర్డర్ అనే అనుమానం అసలే రాదు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు హత్యలు, 20 కి పైగా నేరాలు.. ఐదుగురు ఐదుగురు సభ్యులు.. మొత్తం 22 ఏళ్ళ లోపు వారే.. బంగారం, డబ్బు కోసం జరిగిన ఈ కిరాతక హత్యల్లో ఎట్టకేలకు నిందితులకు జీవిత ఖైదు పడింది.
చెడు వ్యసనాలకు బానిసై బంగారం, డబ్బు సంపాదించాలనే వ్యామోహంతో వీరు చేసిన దారుణాలు ఏడాది క్రితం బెజవాడని ఉలిక్కి పడేలా చేసాయి. పోరంకి ప్రాంతానికి చెందిన 22 ఏళ్ళ సుంకర గోపిరాజు, ప్రభుకుమార్‌లు స్నేహితులు ఆటో నడుపుతుంటారు. చెడు వ్యసనాలకు బానిసై కష్టపడకుండా సులువుగా డబ్బు సంపాదించుకోవాలనుకున్న వీరు నేరాలు, హత్యలు, దోపిడిలు చెయ్యటం ప్రారంబించారు. ఎక్కడా ఆధారాలు దొరకకుండా ఎలాంటి అనుమానాలు రాకుండా ఏడాది క్రితం ఒంటరి వృద్ధ మహిళలను అతి కిరాతకంగా హత్య చేసారు. వీరి యాక్షన్ టీమ్‌లో చక్రి, దుర్గారావు, ఫణింద్ర అనే మరో ముగ్గురు కూడా ఉన్నారు. ఒంటరిగా ఉండే వృద్ధ మహిళలే వీరి టార్గెట్. గోపి ఆటోలో కూరగాయలు అమ్ముతూ పగలు రెక్కీ నిర్వహించేవాడు. ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను గుర్తించి రాత్రికి స్పాట్ పెట్టేవారు. ఈ ఐదుగురు కలిసి రాత్రికి ఫినిష్ చెసేశారు. దండుపాళ్యం గ్యాంగ్ తరహాలో ఏర్పడ్డ ఈ ముఠా తొలినేరం పెనమలూరు లో చేసారు. అప్పటికే ఐదు నేరాలు చేసి, ఆరుగురిని హతమార్చారు. అయినా ఒక్క కేసు బయటకు రాలేదు. అది హత్య అని కూడా ఎవ్వరికీ తెలియలేదు. అదే వీరి స్పెషలిటీ.
వంద గొడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలి వానాకే నేలకూలిందన్నట్లుగా.. ఓ చోరీలో వీరంతా అడ్డంగా దొరికిపోయారు. దాంతో వీరి వ్యవహారం మొత్తం బయటపడింది. గతేడాది పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎంలో దొంగతనం చేసేందుకు యత్నించిన కేసులో సీసీ పుటేజి ద్వారా దర్యాప్తు చేసిన పోలీసులకు ఈ నేరాలు, హత్యలు వెలుగులోకి వచ్చాయి. వీరి వ్యూహాలు, ప్లాన్ల ను తెలుసుకున్న పోలీసులు కూడా షాక్ కు గురయ్యారు. కరోనా సమయం కావటంతో వృద్ధ మహిళలు చనిపోతే అనుమానం రాదని సాధారణ మరణంగా భావిస్తారని పక్కా ప్లాన్‌తో రెక్కీ నిర్వహించి ఇళ్లకు వెళ్లడం, ముందుగా ఆ ఇంట్లో ఉన్న వారిని దుప్పటితోనో లేక దిండుతోనో అదిమిపట్టి ఊపిరి ఆడకుండా చంపి వారి శరీరంపై ఉన్న బంగారం, ఇంట్లో దొరికిన నగదుతో భాధిత కుటుంబాలకు ఎలాంటి డౌట్ రాకుండా తప్పించుకునే వారు. ఇక చనిపోయిన వారు వయస్సులో పెద్ద వారు కావటంతో బంధువులు సైతం సహాజ మరణంగా బావించి అంత్యక్రియలు చేయడంతో ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. కానీ ఒక్క చోరీ కేసులో దొరికిపోయి ఆఖరికి కటకటాల పాలయ్యారు. దాంతో అప్పటికే విరు రెక్కీ నిర్వహించి స్కెచ్‌కు సిద్ధంగా ఉన్న కంకిపాడు, ఉయ్యురు, పెనమలూరు, తెనాలి, మంగళగిరిలో ప్లాన్ ఫెయిల్ అయ్యి, మరిన్ని హత్యలకు బ్రేక్ పడింది.
ఈ కేసులన్నింటిలో నిందితుల నేరం రుజువవ్వటంతో ఎట్టకేలకు బెడజవాడ కోర్టు ఈ ఐదుగురికి జీవిత ఖైదుతో పాటు జరిమానా విధించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..