CM Jagan: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు అప్పుడే.. వైసీపీ నాయకులకు సీఎం జగన్ దిశానిర్ధేశం..
ఏపీలో నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్‌లో ఎన్నికల నోటిఫికేషన్ ముందే రావొచ్చు.. అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం జగన్ చేసిన కామెంట్ ఏపీలో ఎన్నికల హీట్ పెంచింది. 175 టార్గెట్‌గా పనిచేయాలని పార్టీ శ్రేణులను సీఎం జగన్ సిద్ధం చేస్తుంటే.. ప్రతిపక్ష టీడీపీ సైతం దూకుడు పెంచే పనిలో పడింది. మరోవైపు జంపింగ్‌లు, ఇంచార్జ్‌ల మార్పు జోరందుకుంది.
ఏపీలో నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్‌లో ఎన్నికల నోటిఫికేషన్ ముందే రావొచ్చు.. అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం జగన్ చేసిన కామెంట్ ఏపీలో ఎన్నికల హీట్ పెంచింది. 175 టార్గెట్‌గా పనిచేయాలని పార్టీ శ్రేణులను సీఎం జగన్ సిద్ధం చేస్తుంటే.. ప్రతిపక్ష టీడీపీ సైతం దూకుడు పెంచే పనిలో పడింది. మరోవైపు జంపింగ్‌లు, ఇంచార్జ్‌ల మార్పు జోరందుకుంది.
2024 టార్గెట్‌గా ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. గతంలో కంటే ఈసారి 20 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందని సీఎం జగన్ మంత్రులకు చెప్పడంతో రాష్ట్రంలో రాజకీయం నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. 2019లో ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న విడుదలైంది. ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు సీఎం జగన్ చెప్పినట్లుగా 20 రోజుల ముందే షెడ్యూల్ వస్తే.. ఫిబ్రవరి మూడోవారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి మార్చి మూడోవారంలో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. అందుకే క్యాడర్‌ను అప్రమత్తం చేశారు. ఇప్పటి వరకూ పడిన కష్టం ఒక ఎత్తు, ఈ కొన్ని రోజులు మరో ఎత్తుగా భావిస్తూ మంత్రులు పనిచేయాలని జగన్ సూచించారు. ఇప్పుడే ఎన్నికలు అన్నట్లు మంత్రులు కష్టపడాలని జగన్ నిర్దేశించారు.
ఎన్నికల షెడ్యూల్ 20 రోజులు ముందే రావొచ్చనే కోణంలో ఏపీ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంటర్‌తో పాటు పదో తరగతి పరీక్షలనూ మార్చిలోనే నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్రకటించింది ప్రభుత్వం. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నారు సీఎం జగన్. అభ్యర్థులను మార్చాల్సిన అవసరం ఉన్న చోట క్యాడర్‌కి సిగ్నల్ పంపుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాలు మార్చేశారు. కొన్ని చోట్ల ఇంచార్జ్‌లను మార్చేశారు.
ఈ నెలాఖరులోపే మొత్తం 175 స్థానాలకూ అభ్యర్ధులను ప్రకటించనుంది వైసీపీ. అయితే వైసీపీలో 151మందిని మార్చినా ఈసారి ఓటమి ఖాయమంటూ జోస్యం చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తంచేశారు. షెడ్యూల్ వచ్చినా లోక్‌సభ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలూ ఉంటాయి. ఈసీ ప్రకటించిన ప్రకారం గతంలో రెండో దశలోనే ఏపీలో ఎన్నికలు జరిగాయి. ఈ సారి కూడా అదే ఆనవాయితీ కొనసాగవచ్చని భావిస్తున్నారు. అయితే నోటిఫికేషన్ రాకముందే ఏపీలో పొలిటికల్ రచ్చ మొదలైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..