MLC Shaik Sabji: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి.. ప్రమాదం వెనుక కుట్రకోణం ఉందంటున్న ఫ్యామిలీ
వైసీపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ యాక్సిడెంట్... నిజంగా ప్రమాదమేనా?. లేక కావాలని చేసిందా?. ఎవరైనా కుట్రచేసి చంపేశారా?. సాబ్జీని చంపి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు కుటుంబసభ్యులు. సీఐడీ విచారణ జరిపించాలని సాబ్జీ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

అంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ యాక్సిడెంట్… నిజంగా ప్రమాదమేనా?. లేక కావాలని చేసిందా?. ఎవరైనా కుట్రచేసి చంపేశారా?. సాబ్జీని చంపి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు కుటుంబసభ్యులు. సీఐడీ విచారణ జరిపించాలని సాబ్జీ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సాబ్జీని హత్య చేసేంత కక్ష ఎవరికి ఉంది? అసలేం జరిగింది? అని ఆయన అభిమానులు ఆరా తీస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ దగ్గర ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ప్రయాణిస్తున్న కారును.. ఎదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ స్పాట్‌లోనే మరణించారు. డ్రైవర్, గన్‌మెన్, సాబ్జీ పీఏ తీవ్రంగా గాయపడ్డారు. డిసెంబర్ 15న భీమవరంలో జరుగుతున్న అంగన్‌వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
ఏలూరు వైపు నుంచి షేక్ సాబ్జీ కారు వెళ్తుండగా, భీమవరం నుంచి ఆకివీడు వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఇక్కడే సాబ్జీ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇది, పొరపాటున జరిగింది కాదు, కావాలనే, ఉద్దేశపూర్వకంగా యాక్సిడెంట్‌చేసి చంపేశారంటున్నారు కుటుంబసభ్యులు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక ఆధారాలు సేకరించి విచారణ చేపట్టారు.
ఎమ్మెల్సీ సాబ్జీ మరణవార్త తెలిసిన వైసీపీ శ్రేణుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.
షేక్ సాబ్జీ యాక్సిడెంట్‌పై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామంటున్నారు జిల్లా ఎస్పీ రవిప్రకాష్. ఢీకొట్టిన వాహనం కండీషన్ చెక్ చేయాలని మోటార్ వెహికల్ డిపార్ట్‌మెంట్‌కి సూచించినట్టు చెప్పారు. గన్‌మన్ ముత్యాలరాజు ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 304A కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
ఇక, విదేశాల్లో ఉన్న కుమార్తె వచ్చిన తర్వాత సాంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…