AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan: ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం వైఎస్ జగన్.. ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటన

58 నెలల పాలనలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై వివరణ.. చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలను పదే పదే ప్రస్తావిస్తూ సాగుతోంది సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించిన జగన్.. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీకి మరోసారి ఓటు వేయాలని కోరుతున్నారు.

YS Jagan: ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం వైఎస్ జగన్.. ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటన
Ys Jagan Campaign
Balaraju Goud
|

Updated on: May 01, 2024 | 11:05 AM

Share

58 నెలల పాలనలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై వివరణ.. చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలను పదే పదే ప్రస్తావిస్తూ సాగుతోంది సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించిన జగన్.. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీకి మరోసారి ఓటు వేయాలని కోరుతున్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కూడా మూడు జిల్లాల్లో ఆయన సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.

తొలుత విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని బొబ్బిలిలో ఇవాళ తొలి సభ ఉంటుంది. బొబ్బిలి మెయిన్‌రోడ్‌ సెంటర్‌లో జరిగే సభలో జగన్‌ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్‌ పరిధిలోని పాయకరావుపేటలో ప్రచారం నిర్వహిస్తారు. పాయకరావుపేట సూర్యమహల్‌ సెంటర్‌లో ఈ సభ జరనుంది. ఇక, చివరిగా మధ్యాహ్నం 3గంటలకు ఏలూరులోని ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో ప్రచారం నిర్వహిస్తారు జగన్‌

అంతకుముందు కూటమి ఉమ్మడి మేనిఫెస్టోపై ఒక రేంజ్‌లో సెటైర్లు వేశారు సీఎం వైఎస్ జగన్‌. టీడీపీ-జనసేన మేనిఫెస్టోను చూసి బీజేపీ కూడా భయపడిందన్నారు. అందుకే, ఉమ్మడి మేనిఫెస్టోలో ఎక్కడా మోదీ ఫొటో గానీ, బీజేపీ గుర్తు గానీ లేదని.. కూటమి మేనిఫెస్టో అమలు చేయడం అసాధ్యం అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు జగన్‌.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..