CM Jagan: ‘మేమంతా సిద్దం’ యాత్ర వేదికగా వైసీపీలో చేరిన జనసేన నాయకులు..
మరోసారి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. ఎన్నికల శంఖారావంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ చేపట్టిన బస్సుయాత్ర నాలుగో రోజు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొనసాగింది.

మరోసారి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. ఎన్నికల శంఖారావంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ చేపట్టిన బస్సుయాత్ర నాలుగో రోజు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొనసాగింది. ఉదయం పత్తికొండ నుంచి బయలుదేరిన జగన్ ప్రచార రథం రతన మీదుగా తుగ్గలి చేరుకుంది. కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గానికి చెందిన పలువురు జనసేన నేతలు.. తుగ్గలిలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ముమ్మడివరం జనసేన ఇన్‌ఛార్జ్ పితాని బాలకృష్ణతో పాటు పలువురు నేతలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. పత్తికొండ నియోజకవర్గం పరిధిలోని తుగ్గలిలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించిన సీఎం జగన్.. తుగ్గలి పరిధిలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
దేశంలో రూ. 3వేలు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను గమనించాలని కోరారు. లంచాలు, వివక్షకు అవకాశం లేకుండా అర్హులందరికీ పథకాలు అందిస్తున్నామన్నారు జగన్. అనంతరం ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు. తుగ్గలిలో ముఖాముఖి ముగిసిన అనంతరం తిరిగి ప్రారంభమైన జగన్ బస్సుయాత్ర గుంతకల్లు నియోజకవర్గంలో కొనసాగింది. బసినేపల్లిలో ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు వైఎస్ జగన్‌కు స్వాగతం పలికారు. అనంతరం గజరాంపల్లి, జొన్నగిరి మీదుగా గుత్తి చేరుకుంది సీఎం జగన్ బస్సుయాత్ర. గుత్తి రోడ్‌షోకు జనం నుండి భారీ స్పందన వచ్చింది. వెల్లువలా తరలివచ్చిన ప్రజలు.. రోడ్‌షోలో పాల్గొన్నారు. గుత్తి రోడ్‌షో ముగిసిన అనంతరం.. పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి, సంజీవపురం శివారు వరకు సీఎం జగన్ యాత్ర కొనసాగింది. అనంతపురం జిల్లాలోని సంజీవపురం శివారులో ఈ రాత్రి బస చేస్తున్నారు సీఎం జగన్. నాలుగో రోజు మొత్తం 102 కిలోమీటర్ల దూరం కొనసాగింది మేమంతా సిద్ధం యాత్ర.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




