AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Election Commission: ఇలా చేస్తేనే ప్రచారాలకు అనుమతి.. అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ కొత్త రూల్స్..

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచార వేడి కనిపిస్తుంది. పోలింగ్‎కి ఇంకా 40 రోజులుపైనే టైం ఉన్నపటికీ అభ్యర్థులు మాత్రం ప్రచారంలో తగ్గేదెలే అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ప్రచారంలో ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఎన్నికలకు ముందు మరో ఎత్తు అనేలా ఎన్నికల కమిషన్ ప్రచారంలో తొలిసారిగా ఆంక్షలు పెట్టింది.

Election Commission: ఇలా చేస్తేనే ప్రచారాలకు అనుమతి.. అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ కొత్త రూల్స్..
Suvidha App
Ch Murali
| Edited By: |

Updated on: Mar 30, 2024 | 9:39 PM

Share

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచార వేడి కనిపిస్తుంది. పోలింగ్‎కి ఇంకా 40 రోజులుపైనే టైం ఉన్నపటికీ అభ్యర్థులు మాత్రం ప్రచారంలో తగ్గేదెలే అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ప్రచారంలో ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఎన్నికలకు ముందు మరో ఎత్తు అనేలా ఎన్నికల కమిషన్ ప్రచారంలో తొలిసారిగా ఆంక్షలు పెట్టింది. ప్రచారాలకు సంబంధించి సమాచారం ముందుగా ఇవ్వాలని కొత్త యాప్ రూపొందించింది. ఏ పార్టీకి చెందిన అభ్యర్థులైనా ప్రచారాలకు సంబంధించి 48 గంటల ముందు సువిధ అనే యాప్‎లో అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న 24 గంటల్లోనే అనుమతి వస్తుంది.

2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారం కోసం అధికారుల నుంచి వేగంగా, ఎటువంటి వ్యయ ప్రయాసలు లేకుండా అనుమతులు పొందేందుకు భారత ఎన్నికల సంఘం సువిధ సింగిల్ విండో యాప్‌ను ప్రవేశపెట్టింది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ర్యాలీలు, ఊరేగింపులు వంటివి నిర్వహించే పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల సంఘం అనుమతిని తీసుకునేందుకు సువిధ యాప్‎ను వినియోగించుకోవచ్చు. అభ్యర్థులు 48 గంటలకు ముందు దరఖాస్తులు చేసుకుంటే, 24 గంటల్లోనే అధికారులు అనుమతులు జారీ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టీల నుండి పోటీ చేసే అభ్యర్థులు అనుమతుల కోసం సువిధ యాప్ సింగిల్ విండో పద్దతిలో దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో గానేఅనుమతులను అధికారులు మంజూరు చేస్తున్నారు.

మీటింగ్, ర్యాలీలు, వాహనాలు, తాత్కాలిక ఎలక్షన్ ఆఫీస్, లౌడ్ స్పీకర్, హెలికాప్టర్, హెలిప్యాడ్, డోర్ టు డోర్ ప్రచారం, డిస్ ప్లే బ్యానర్స్, ఫ్లాగ్స్, ఎయిర్ బెలూన్స్, హోర్డింగులు, బ్యానర్లు, వీడియో వ్యాన్ మొదలైన అనుమతులు పొందేందుకు రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభతరంగా సువిధ పోర్టల్‎లో దరఖాస్తు చేసుకునేలా ఇచ్చే ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. అలాగే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాల వద్దనే అనుమతి తీసుకునేందుకు వీలుగా కూడా సువిధ కౌంటర్‎ను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ ప్రచార అనుమతుల కోసం సువిధ ఆన్లైన్ పోర్టల్‎లో దరఖాస్తులు చేసుకుని వేగంగా అనుమతులు పొంది, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో అన్ని విధాల జిల్లా యంత్రాంగానికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్