AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan Delhi Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటనకు ఎందుకు వెళ్లారో చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి

CM Jagan Delhi Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ పర్యటకు వెళ్లారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి..

CM Jagan Delhi Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటనకు ఎందుకు వెళ్లారో చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి
Subhash Goud
|

Updated on: Jan 19, 2021 | 9:05 PM

Share

CM Jagan Delhi Tour:ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ పర్యటకు వెళ్లారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ పర్యటన వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పోలవరం నిధులు వంటి అంశాలపై మాత్రమే జగన్‌ అమిత్‌షాను కలువనున్నారని వెల్లడించారు. సీఎం జగన ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేయడంపై ఆయన స్పందించారు.

తాము బలహీనులము కాదని, అలాగే బలాన్ని ఎక్కువగా అంచనా వేసుకోవడం లేదని ఆయన అన్నారు. రాజకీయ పార్టీగా తమకంటూ ప్రత్యేక విధి విధానాలు ఉన్నాయని, మరో వైపు కొడాలి నాని, దేవినేని ఉమా ఎపిసోడ్‌లో పూర్తి బాధ్యత టీడీపీదేనంటూ పునరుద్ఘాటించారు. టీడీపీ నేతలు పదేపదే ఒకే అబద్దాన్ని చెప్పి నిజం చేయాలని చూస్తోందని, వారి ఆరోపణలు, వారి సవాళ్లు, అసత్య ప్రచారాలకు తాము బెదిరిపోమని పేర్కొన్నారు. దేవాలయాలపై దాడుల వెనుక ఎవరి హస్తం ఉందే రాష్ట్ర ప్రజలకు ఇది వరకే అర్థమైపోయిందని అన్నారు.

అలాగే జగన్‌ ఢిల్లీ పర్యటనలో భాగంగా హైకోర్టు విభజన అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని సజ్జల అన్నారు. రాజధాని భూముల్లో జరిగిన ఇన్‌సైడ్‌ ట్రేండింగ్‌పై సీబీఐ విచారణ కొనసాగుతుందని, త్వరలో నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.

Also Read: Jagan Delhi Tour: ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. రాత్రి 10 గంటలకు అమిత్ షాతో భేటి..