Jagan Delhi Tour: ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. రాత్రి 10 గంటలకు అమిత్ షాతో భేటి..

|

Updated on: Jan 19, 2021 | 11:15 PM

CM Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. సీఎం జగన్ వెంట విజయసాయిరెడ్డి...

Jagan Delhi Tour: ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. రాత్రి 10 గంటలకు అమిత్ షాతో భేటి..

CM Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. సీఎం జగన్ వెంట విజయసాయిరెడ్డి, ఎంపీలు, ఉన్నతాధికారులు వెళ్లారు. ఇవాళ రాత్రి 10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటి కానున్నారు.

ఈ భేటిలో సీఎం జగన్.. అమరావతిలో అక్రమాల విచారణ, మూడు రాజధానుల ఏర్పాటు, కర్నూలుకు హైకోర్టు తరలింపు, విభజన హామీలు వంటి కీలకాంశాలపై హోంమంత్రి అమిత్ షాతో చర్చించనున్నారు. అలాగే రేపు(జనవరి 20) కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ భేటి అయ్యే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి సవరించిన అంచనాలపై, ఏపీకి రావాల్సిన నిధులపై బడ్జెట్ కేటాయింపులు ఉండాలని కోరనున్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 19 Jan 2021 11:15 PM (IST)

    అమిత్‌ షాతో ముగిసిన ఏపీ సీఎం జగన్‌ భేటీ

    కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు అంశం, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పలు అంశాలను సీఎం జగన్‌ అమిత్‌ షా దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. సీఎం జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ఉ‍న్నారు.

  • 19 Jan 2021 07:41 PM (IST)

    ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్..

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. సీఎం జగన్ వెంట విజయసాయిరెడ్డి, ఎంపీలు, అడ్వకేట్ జనరల్, ఉన్నతాధికారులు వెళ్లారు. ఇవాళ రాత్రి 10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటి కానున్నారు.

  • 19 Jan 2021 06:29 PM (IST)

    పోలవరం ప్రాజెక్టు నిధులపై చర్చ.. అమిత్ షాతో కీలక భేటిలో ప్రధాన అంశం..

    విభజన హామీలపై సీఎం జగన్ ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించనున్నారు. ప్రత్యేక హోదా, రెవెన్యు లోటు భర్తీ, పోలవరం తో పాటు అనేక ప్రాజెక్టులు విభజన చట్టంలో పొందుపరిచి అంశాల్లో భాగమై ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకు నిధులు సకాలంలో రిలీజ్ చేసి.. పూర్తి అయ్యేందుకు సహకరించాలని జగన్ కోరే అవకాశం ఉంది.

  • 19 Jan 2021 06:07 PM (IST)

    సీఎం జగన్ టూర్‌కు రాజకీయ ప్రాధాన్యత లేదు.. సజ్జల రామకృష్ణారెడ్డి

    ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్‌కు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. పెండింగ్ ప్రాజెక్టులతో పాటు ఏపీకి రావాల్సిన నిధులపైన కేంద్రమంత్రులతో సీఎం జగన్ చర్చిస్తారని ఆయన అన్నారు.

  • 19 Jan 2021 05:54 PM (IST)

    ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ భేటి అయ్యే అవకాశం..

    రేపు(జనవరి 20) ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటి అయ్యే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి సవరించిన అంచనాలపై, ఏపీకి రావాల్సిన నిధులపై బడ్జెట్ కేటాయింపులు ఉండాలని సీఎం జగన్ కోరే అవకాశం ఉంది.

  • 19 Jan 2021 05:42 PM (IST)

    సీఎం జగన్, అమిత్ షా భేటిలో చర్చించే ప్రధానాంశాలు ఇవే..

    అమరావతిలో అక్రమాల విచారణపైనే ప్రధానంగా చర్చించనున్నారని సమాచారం. అలాగే మూడు రాజధానుల ఏర్పాటు, కర్నూలుకు హైకోర్టు తరలింపు, విభజన హామీలు వంటి కీలకాంశాలు ప్రధాన ఎజెండాగా ఏపీ సీఎం వైఎస్ జగన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఏపీలో నెలకొన్న పరిస్థితులపై అమిత్‌షాతో జగన్‌ చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం. అటు ఏపీ ఆలయాల దాడులపై నివేదిక ఇవ్వనున్నారని టాక్.

  • 19 Jan 2021 05:34 PM (IST)

    కొత్త ఏడాదిలో తొలి భేటి.. సీఎంతో పాటు అడ్వకేట్ జనరల్ కూడా ఢిల్లీకి పయనం..

    కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాత్రి 9 గంటలకు భేటి కానున్నారు. కొత్త ఏడాదిలో తొలి భేటి కావడం.. బడ్జెట్ కంటే ముందు ఉండటంతో ఈ భేటి ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎంతో పాటు అడ్వకేట్ జనరల్ కూడా ఢిల్లీ వెళ్ళడంతో ఆసక్తికరంగా మారింది.

  • 19 Jan 2021 05:28 PM (IST)

    సీఎం జగన్ ఢిల్లీ టూర్.. హోంమంత్రి అమిత్ షాతో అపాయింట్‌మెంట్ ఫిక్స్..

    ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పయనమయ్యారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళుతున్న ఆయన.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటి కానున్నారు. ఈ మేరకు రాత్రి 9 గంటలకు అపాయింట్‌మెంట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

Follow us
అమ్మో.. ఢిల్లీ.. ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ
అమ్మో.. ఢిల్లీ.. ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ
దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్.. కొత్త కోపైలట్ ప్రో ఆవిష్కరణ
దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్.. కొత్త కోపైలట్ ప్రో ఆవిష్కరణ
ప్రేమ పేరుతో నయవంచన! భార్య మెడలో తాళి తెంచి.. నడిరోడ్డుపై వదిలేసి
ప్రేమ పేరుతో నయవంచన! భార్య మెడలో తాళి తెంచి.. నడిరోడ్డుపై వదిలేసి
టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న శ్రీలీల.. అసలు మ్యాటర్ ఇదే
టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న శ్రీలీల.. అసలు మ్యాటర్ ఇదే
హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..?మరి ఎనిమిది నిముషాలు ఏమైంది
హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..?మరి ఎనిమిది నిముషాలు ఏమైంది
కరెంట్‌ బిల్లు పెరగకుండా.. ఏసీల వాడొచ్చా? అదెలా?
కరెంట్‌ బిల్లు పెరగకుండా.. ఏసీల వాడొచ్చా? అదెలా?
ఎన్‌సీఏ నుంచి కేఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ, ఓ కండీషన్..
ఎన్‌సీఏ నుంచి కేఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ, ఓ కండీషన్..
అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు
అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు
విషాదం..పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
విషాదం..పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
రోడ్లపై చక్కర్లు కొడుతున్న కొత్త ఎలక్ట్రిక్ కారు..
రోడ్లపై చక్కర్లు కొడుతున్న కొత్త ఎలక్ట్రిక్ కారు..