AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Mandous: అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. తుపాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష..

CM Jagan: బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను ఆంధ్రప్రదేశ్ ను కలవరపెడుతోంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారుల ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. దీంతో తుపాను పరిస్థితులపై...

Cyclone Mandous: అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. తుపాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష..
AP CM Jagan
Ganesh Mudavath
|

Updated on: Dec 08, 2022 | 3:32 PM

Share

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను ఆంధ్రప్రదేశ్ ను కలవరపెడుతోంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారుల ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. దీంతో తుపాను పరిస్థితులపై సీఎం జగన్ సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మాండూస్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అలర్ట్ గా ఉండాలన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే పునరావాస కేంద్ర తరలింపుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు ఆయన సూచించారు. అలాగే రైతుల్లో కూడా ఈ తుపాను పట్ల అవగాహన కల్పించాలని, రైతు సహాయకారిగా ఉండాలని జగన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకుండా నిరోధించాలని కోరారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని, అప్పుడే ప్రాణ, ఆస్తి నష్టం కలగకండా కాపాడుకోవచ్చని వివరించారు.

మాండూస్‌ తుపాన్‌ నైరుతి బంగాళాఖాతం మీదుగా ట్రింకోమలీ (శ్రీలంక) కి తూర్పు ఈశాన్యంగా 300 కి.మీ. జాఫ్నా (శ్రీలంక)కి తూర్పు ఆగ్నేయంగా 420 కి.మీ., కారైకాల్కు తూర్పు ఆగ్నేయంగా 460 కి.మీ. చెన్నైకి ఆగ్నేయంగా 550 కి.మీ వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి మధ్య 9 డిసెంబర్ అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో పుదుచ్చేరి శ్రీహరికోట దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను ఆనుకుని 65 నుండి 75 కిలోమీటర్లు గరిష్టంగా 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఉత్తర తమిళనాడుకి దగ్గర్లో ఉన్న ఈ తుపాను శనివారం ఉదయం శ్రీహరికోట – పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం. దీని ప్రభావం వల్ల ఉత్తర తమిళనాడుతోపాటూ.. రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం. ఈ తుపాను ప్రభావంతో మూడు రోజులపాటు.. దక్షిణ కోస్తాంధ్రాలోని ప్రకాశరం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. అలాగే, రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..