CM Jagan: సౌర,పవన విద్యుత్ ప్లాంట్లకు శంకుస్థాపన.. గ్రీన్ ఎనర్జీలో దేశానికే ఏపీ ఆదర్శన సీఎం జగన్..
సోలార్, పవన్ విద్యుత్ ప్రాజెక్టులతో రాష్ట్రానికి, రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు ఏపీ సీఎం జగన్. ఏపీలో 3 సౌర, పవన్ విద్యుత్ ప్రాజెక్టులను సీఎం జగన్ ప్రారంభించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగడంతోపాటు, పర్యావరణానికి ఎలాంటి హాని జరగదన్నారు. రాష్ట్ర అభివృద్దికి ఈ ప్రాజెక్టులు ఓ నిదర్శమన్నారు సీఎం జగన్.
గ్రీన్ ఎనర్జీ విషయంలో దేశానికే ఏపీ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు ఏపీ సీఎం జగన్. నంద్యాలజిల్లాలో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల కోసం NHPCతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 8 వేల ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి. సోలార్ పవర్ ప్రాజెక్టు వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని..గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసే విషయంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు సీఎం జగన్.
రైతులకు సరఫరా చేసే ఉచిత విద్యుత్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండొద్దనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపబడుతోందన్నారు సీఎం జగన్. ఈ క్రమంలోనే సోలార్, పవన్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు విషయంలో పలు కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామన్నారు. సోలార్ పవర్ కోసం యూనిట్ విద్యుత్‌ను 2.49 రూపాయలకు ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నామని తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ సోలార్ పవర్‌ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు.ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందన్నారు సీఎం జగన్.
నంబర్ వన్ గా మారేందుకు..
గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ గా మారేందుకు ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని ముఖ్యమంత్రి అన్నారు. ఔక మండలం జునూతల గ్రామంలో గ్రీన్‌కో గ్రూపు ఏర్పాటు చేయనున్న 2,300 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుకు, పాణ్యం మండలం కందికాయపల్లె గ్రామంలో ఏఎం గ్రీన్ ఎనర్జీ ద్వారా 700 మెగావాట్ల సోలార్, 314 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లకు ఆయన శంకుస్థాపన చేశారు. బేతంచెర్ల మండలం ముద్దవరం గ్రామంలో ఎకోరెన్ ఎనర్జీ ద్వారా 1,000 మెగావాట్ల సోలార్, పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నారు.
సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు..
నంద్యాలజిల్లాలోని అవుకు మండలం జానూతల గ్రామంలో 2,300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. మరో వైపు పాణ్యం మండలంలోని కందికాయపల్లె గ్రామంలో పవన్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ యేడాది మార్చిలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకుగానూ సోలార్, పవన్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.
రెండేళ్లకు ఐదు శాతం చొప్పున..
స్థానికులకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు కంపెనీలు ఒక్కో మెగావాట్‌కు రూ.లక్ష రాయల్టీ చెల్లించి రైతులకు రూ. తమ భూములు ఇచ్చినందుకు ప్రతి రెండేళ్లకు ఐదు శాతం చొప్పున ఎకరాకు రూ.30,000. రాష్ట్రం ఇప్పటికే 8999 మెగావాట్ల సౌర, పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో విద్యుత్‌ను రూ. 2. యూనిట్‌కు 49 మరో 25 నుండి 30 సంవత్సరాల వరకు రైతులకు పగటిపూట ఉచిత విద్యుత్‌ను అందించడంలో సహాయపడుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం