AP News: ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..

చంద్రబాబు, ఆయన తనయుడు, పవన్‌కళ్యాణ్‌.. కుప్పం, మంగళగిరి, పిఠాపురం.. ఈ మూడు స్థానాలు.. ఆ ముగ్గురు నేతలపై ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం జగన్‌. మూడు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోన్న వైసీపీ అధినేత.. ఆ పార్టీ ముగ్గురు అభ్యర్థులను స్పెషల్‌గా ప్రమోట్‌ చేస్తున్నారు. తాజాగా.. కాకినాడ సభలో పిఠాపురం అభ్యర్థి వంగా గీతను హీరోగా పరిచయం చేశారు సీఎం జగన్.

AP News: ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
Cm Jagan
Follow us

|

Updated on: Apr 20, 2024 | 8:16 AM

చంద్రబాబు, ఆయన తనయుడు, పవన్‌కళ్యాణ్‌.. కుప్పం, మంగళగిరి, పిఠాపురం.. ఈ మూడు స్థానాలు.. ఆ ముగ్గురు నేతలపై ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం జగన్‌. మూడు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోన్న వైసీపీ అధినేత.. ఆ పార్టీ ముగ్గురు అభ్యర్థులను స్పెషల్‌గా ప్రమోట్‌ చేస్తున్నారు. తాజాగా.. కాకినాడ సభలో పిఠాపురం అభ్యర్థి వంగా గీతను హీరోగా పరిచయం చేశారు సీఎం జగన్. లోకల్‌ హీరో కావాలా.. సినిమా హీరో కావాలా.. అంటూ పవన్‌ను సైతం టార్గెట్‌ చేయడం ఆసక్తిగా మారింది.

ఏపీలో ఎన్నికల హీట్‌ తారాస్థాయికి చేరుతోంది. ప్రధాన పార్టీల నేతలందరూ ఎవరికివారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైసీపీ అధినేత, సీఎం జగన్‌ మేమంతా సిద్ధం అంటూ 20రోజులుగా బస్సుయాత్రతో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే.. కొన్ని స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా.. కుప్పం, మంగళగిరి, పిఠాపురం అసెంబ్లీ స్థానాలపై స్పెషల్‌ ఫోకస్‌తోపాటు స్పెషల్‌ ప్రమోషన్‌ కూడా చేస్తున్నారు సీఎం జగన్‌. ఇక.. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో.. అక్కడి వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే.. వంగా గీత గెలుపు బాధ్యతలు రీజనల్ ఇన్‌ఛార్జ్‌ మిథున్‌రెడ్డి, కాపునేత ముద్రగడ పద్మానాభానికి అప్పగించారు. ఈ లెక్కన పిఠాపురంలో వైసీపీ గెలిచి తీరాలన్న లక్ష్యంతో సీఎం జగన్‌ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక.. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా.. కాకినాడలో పర్యటించిన సీఎం జగన్‌.. పిఠాపురం గురించి ప్రత్యేకించి ప్రస్తావించారు. కాకినాడ సభలో పవన్‌కల్యాణ్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూనే.. అభ్యర్థుల పరిచయ కార్యక్రమంలో వంగా గీతను కార్యకర్తలకు స్పెషల్‌గా పరిచయం చేశారు సీఎం జగన్. వంగా గీతను లోకల్‌ హీరోగా ఇంట్రడ్యూస్‌ చేశారు. పవన్‌కల్యాణ్ పిఠాపురంలో గెలిస్తే.. గెలిచినంత సేపు మాత్రమే ఇక్కడ ఉంటారని.. కానీ.. లోకల్‌గా ఉండే వంగ గీతను గెలిపించుకుంటే నియోజకవర్గానికి మంచి జరుగుతుందన్నారు. పవన్‌కల్యాణ్‌కి జ్వరం వచ్చినా హైదరాబాద్ వెళ్తారని ఎద్దేవా చేశారు. అందుకే.. లోకల్ హీరో కావాలో.. సినిమా హీరో కావాలో ఆలోచించి ఓటు వేయాలన్నారు సీఎం జగన్.

ఇవి కూడా చదవండి

ఇదిలావుంటే.. చిత్తూరు జిల్లా కుప్పం, గుంటూరు జిల్లా మంగళగిరిపైనా సీఎం జగన్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. గత ఫిబ్రవరిలో కుప్పంలో పర్యటించిన సీఎం జగన్.. అక్కడి ప్రజలకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థిగా భరత్ నిలబడుతున్నాడని.. కుప్పం ప్రజలు ఆయన్ను ఆశీర్వదించాలని కోరారు. కుప్పం ఎమ్మెల్యేగా భరత్‌ను ఎన్నుకుంటే కేబినెట్‌లో మంత్రి పదవి ఇస్తానని, గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని ప్రకటించారు. భరత్‌ ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, సంక్షేమం అందిస్తానని హామీ ఇచ్చారు సీఎం జగన్‌. మరోవైపు.. మంగళగిరి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మురుగుడు లావణ్యకు సైతం సీఎం జగన్‌ బాసటగా నిలిచారు. కొద్దిరోజుల క్రితం మంగళగిరిలో మేమంతా సిద్ధం బస్సుయాత్ర చేసిన సీఎం జగన్‌.. చేనేత వర్గానికి చెందిన లావణ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చేనేత వర్గానికి చెందిన మహిళకు మంగళగిరి టికెట్ ఇచ్చామని.. ఆమె గెలుపు కోసం అందరూ కృషి చేయాలని సూచించారు సీఎం జగన్‌. మొత్తంగా.. కుప్పం, మంగళగిరి. పిఠాపురం స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్‌ స్పెషల్‌ ప్రమోషన్‌తో క్యాడర్‌లో ఫుల్‌ జోష్‌ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఆ మూడు స్థానాల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..