Brahmotsavams: వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో రాములోరి ఊరేగింపు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు శుక్రవారం ఉదయం వటపత్ర సాయి అలంకారంలో సీతా లక్ష్మణ సమేత శ్రీరాముడి ఊరేగింపు కనులపండువగా సాగింది. సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, పుష్పమాలలు, ఆభరణాలతో సుందరంగా ముస్తాబు చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు శుక్రవారం ఉదయం వటపత్ర సాయి అలంకారంలో సీతా లక్ష్మణ సమేత శ్రీరాముడి ఊరేగింపు కనులపండువగా సాగింది. సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, పుష్పమాలలు, ఆభరణాలతో సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామి, అమ్మవార్ల ఊరేగింపు కోలాహలంగా సాగింది. భక్త జన బృందాలు, కళాకారుల చెక్క భజనలు, కోలాట నృత్య ప్రదర్శనలు, కేరళ వాయిద్యాలు నడుమ ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
దక్షణ భారతదేశంలో రెండవ అయోధ్యగా ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయానికి పేరుంది. ఇక దేశంలోనే ఎక్కడా లేని రీతిలో ఇక్కడి రామాలయంలో హనుమంతుడు కనిపించడు. ఆంజనేయ స్వామి లేని రామాలయం కూడా ఇదొక్కటే కావడం విశేషం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్తో వంటనూనె తయారీ!
40 ఏళ్లుగా మ్యూజియంలో నక్కిన అతిపెద్ద పాము

