Chilkur Balaji Temple: చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

Chilkur Balaji Temple: చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

Anil kumar poka

|

Updated on: Apr 20, 2024 | 9:17 AM

వీసా దేవుడు.. కలియుగదైవం చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు సంతానం లేని మహిళలకు గర్భ ప్రసాదం అందించారు. గరుత్మంతుడికి నైవేద్యం సమర్పించి సంతానం కలగని మహిళలకు పంపిణీ చేయడంతో శుక్రవారం తెల్లవారుఝామున 5 గంటల నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీగా చేరుకున్నారు.

వీసా దేవుడు.. కలియుగదైవం చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు సంతానం లేని మహిళలకు గర్భ ప్రసాదం అందించారు. గరుత్మంతుడికి నైవేద్యం సమర్పించి సంతానం కలగని మహిళలకు పంపిణీ చేయడంతో శుక్రవారం తెల్లవారుఝామున 5 గంటల నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీగా చేరుకున్నారు. దీంతో రాజేంద్రనగర్ పోలీస్ అకాడమీ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్కూళ్ల కి కాలేజీలకు ఆఫీసులకు వెళ్లే వారు ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకుపోయారు. పోలీసులు అతికష్టమ్మీద ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. గర్భ ప్రసాదం తీసుకున్నవారికి సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తుండడంతో ప్రతి సంవత్సరం ఈ ప్రసాదానికి ఆదరణ పెరుగుతోంది.

చిలుకూరు బాలాజీ ఆలయంలో ఏటా వారం పాటు జరిగే బ్రహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు వేదపండితులు పుట్టమన్నుతో పూజలకు అంకుర్పారణ చేశారు. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. వేడుకల్లో బాలాజీ ఆలయ మేనేజింగ్‌ కమిటీ చైర్మన్‌ సౌందరరాజన్‌, ప్రధానార్చకులు రంగరాజన్‌, ఆలయ కమిటీ సభ్యులు గోపాలకృష్ణపంతులు,స్వామి, సిబ్బంది పాల్గొన్నారు. ఐదు శతాబ్దాల చరిత్ర కలిగిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు ఏటా శ్రీరామనవమి తరువాత దశమి రోజు నుంచి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం ఏప్రిల్ 18 సెల్వర్‌ కూత్తుతో అంకురార్పణ జరిగింది. మొదట పుట్టమన్ను తెచ్చి హోమగుండాలను ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. 19న ధ్వజారోహణం, శేషవాహన సేవలు నిర్వహిస్తారు. 20వ తేదీన స్వామివారికి గోపవాహన, హనుమంత వాహన సేవలు జరుగుతాయి. 21న సూర్యప్రభ వాహనం, గరుడ వాహన సేవలు ఉంటాయి.. అదే రోజు రాత్రి 10.30 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!