AC Helmets: ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు.. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు కూలింగ్..
అసలే మండే వేసవికాలం.. ఆ పై ట్రాఫిక్ పోలీసులు.. ఎండలో పని. వారి కష్టం మామూలుగా ఉండదు. భానుడి భగభగల మధ్య విధులు నిర్వహించాలి. ఎండ వేడిని తట్టుకునేలా సంరక్షణ చర్యలు తీసుకోవాలి. ఇంతటి కష్టం అనుభవించే ట్రాఫిక్ పోలీసుల బాధను అర్థం చేసుకుని గుజరాత్‌లోని వడోదర పోలీసులు పరిష్కారం కనుగొన్నారు. తమ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్‌లను అందిస్తున్నారు.
అసలే మండే వేసవికాలం.. ఆ పై ట్రాఫిక్ పోలీసులు .. ఎండలో పని. వారి కష్టం మామూలుగా ఉండదు. భానుడి భగభగల మధ్య విధులు నిర్వహించాలి. ఎండ వేడిని తట్టుకునేలా సంరక్షణ చర్యలు తీసుకోవాలి. ఇంతటి కష్టం అనుభవించే ట్రాఫిక్ పోలీసుల బాధను అర్థం చేసుకుని గుజరాత్‌లోని వడోదర పోలీసులు పరిష్కారం కనుగొన్నారు. తమ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్‌లను అందిస్తున్నారు. ఈ హెల్మెట్లు 40-42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద చల్లదనాన్ని అందిస్తాయి. ఇవి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంటాయి. సూర్యకాంతి నుంచి కళ్లను రక్షించడానికి వీజర్, ఛార్జింగ్ పాయింట్ ఉంటాయి. హెల్మెట్‌ని పూర్తిగా ఛార్జ్ చేస్తే 8 గంటల వరకు కూలింగ్‌ని అందిస్తాయి.
వడదెబ్బ కారణంగా చాలా మంది అధికారులు ఈ మధ్య కాలంలో రోడ్డుపై స్పృహ కోల్పోయి పడిపోతున్నారు. దీంతో ఎండ బారి నుంచి తప్పించడానికి పోలీసులు వినూత్న ఐడియాకి శ్రీకారం చుట్టారు. హెల్మెట్ ప్రయోగం విజయవంతం అయింది. దీని సాయంతో ట్రాఫిక్ పోలీసులు తమ విధులను సౌకర్యవంతంగా నిర్వహిస్తున్నారు. పోలీసుల ఐడియాను ప్రజలు అభినందిస్తున్నారు. వడోదర పోలీసుల ఆలోచన చాలా మంచిదని.. ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా ఏసీ హెల్మెట్ల విషయంలో చొరవ చూపాలని నెటిజన్లు కామెంట్‌లు పెడుతున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్‌పుర్‌లో కూడా ట్రాఫిక్ పోలీసులు ఏసీ హెల్మెట్లు ధరించి విధులు నిర్వర్తిస్తున్నారు. నగరంలోని ఆరు ప్రధాన కూడళ్లలో పని చేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు హెల్మెట్‌లను అందించినట్లు ట్రాఫిక్ డీసీపీ ఆర్తీ సింగ్ చెప్పారు. నగరంలోని ఇతర ట్రాఫిక్ పోలీసులకు కూడా త్వరలో వాటిని అందిస్తామన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!