AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. లోపలున్న బ్యాగులు తెరిచి చూడగా కళ్లు జిగేల్!

Hyderabad: ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. లోపలున్న బ్యాగులు తెరిచి చూడగా కళ్లు జిగేల్!

Ravi Kiran
|

Updated on: Apr 20, 2024 | 11:55 AM

Share

వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలంలో పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. మండలం కేంద్రంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేసే సమయంలో ఓ కారు నుంచి.. లోపలున్నవి చూసి దెబ్బకు పోలీసులు షాక్ అయ్యారు. ఇంతకీ ఆ కథేంటి.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అసలే ఎన్నికల కోడ్.. రూ. 50 వేలకు పైగా డబ్బును తీసుకెళ్లకూడదు. కానీ ఈ ముగ్గురు అనుకున్నది జరగలేదు. డామిట్‌ కధ అడ్డం తిరిగింది. అనుకున్నది అనుకున్నట్టు జరిగి ఉంటే.. డబ్బు చేరాల్సిన చోటుకు చేరేది. కానీ అలా జరగలేదు. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలంలో పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. మండలం కేంద్రంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేసే సమయంలో ఓ కారు నుంచి రూ. 1.50 కోట్ల నగదును సీజ్ చేశారు. శుక్రవారం పులిమామిడి క్రాస్ రోడ్స్, నవాబ్ పేట్ మెయిన్ రోడ్డులో నవాబ్ పేట్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ‘TS 09EQ 0004’ నెంబర్ గల ఇన్నోవా క్రిష్టా కారులో ఒక కోటి 50 లక్షలు రూపాయలు గుర్తించారు పోలీసులు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో.. సరైన ఆధారాలు చూపించకపోవడంతో డబ్బులు సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు కూకట్‌పల్లిలో డబ్బుల రవాణా చేసే వాహనంలో నిబంధనలు పాటించకుండా తరలిస్తున్న రూ. 1.37 లక్షలను పట్టుకున్నారు సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు. ఎస్ఓటీ బాలానగర్ టీం, కేపీహెచ్‌బీ పోలీసులు సంయుక్తంగా నెక్సాస్ మాల్ దగ్గర నిర్వహించిన తనిఖీల్లో ఈసీ కోడ్ లేకుండానే లెక్కలు చూపని డబ్బును రవాణా చేస్తున్న రైటర్ సేఫ్ గార్డ్ వాహనాన్ని సీజ్ చేశారు పోలీసులు.

Published on: Apr 20, 2024 11:00 AM