కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్.. ఆస్తులు, అప్పుల వివరాలివే..

కడప జిల్లాలో వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. శనివారం ఉదయం ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నామినేషన్ పత్రాలను ఘాట్ వద్ద పెట్టి నివాళులు అర్పించారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఆమెతో పాటు ప్రత్యేక ప్రార్థనల్లో బ్రదర్ అనిల్ కుమార్, అక్క డాక్టర్ సునీతా రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ షర్మిలా కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు.

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్.. ఆస్తులు, అప్పుల వివరాలివే..

|

Updated on: Apr 22, 2024 | 1:11 PM

కడప జిల్లాలో వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. శనివారం ఉదయం ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నామినేషన్ పత్రాలను ఘాట్ వద్ద పెట్టి నివాళులు అర్పించారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఆమెతో పాటు ప్రత్యేక ప్రార్థనల్లో బ్రదర్ అనిల్ కుమార్, అక్క డాక్టర్ సునీతా రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ షర్మిలా కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. నాన్న దగ్గర నామినేషన్ పత్రాలు పెట్టీ ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు. కడప ప్రజలు విజ్ఞత కలిగిన వాళ్ళన్నారు. ప్రస్తుత రాజకీయాలన్నింటినీ అర్థం చేసుకోగలరని చెప్పారు. కడప ప్రజలు మంచి తీర్పు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కడప ప్రజలు వైఎస్ఆర్, వివేకాను ఇంకా మరిచిపోలేదన్నారు. తన గెలుపుపై సంపూర్ణ నమ్మకం ఉందని చెప్పారు. అది నిరూపించుకునే సమయం ఆసన్నం అయ్యిందని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో భారీ మెజారిటీ‎తో గెలుస్తానని దృఢమైన నమ్మకం ఉందని ఆత్మవిశ్వాసాన్ని చాటారు.

వైఎస్ షర్మిల ఆస్తి, అప్పుల వివరాలివే..

కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల ఆస్తులు, అప్పుల వివరాలు తన అఫిడవిట్లో ప్రకటించారు. ఏపీ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆస్తుల విలువ రూ .132.56 కోట్లు కాగా అప్పులు రూ .82.77 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఇందులో తన సోదరుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి రూ.82.58 కోట్ల అప్పుగా తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే సీఎం జగన్ భార్య వైఎస్ భారతి నుండి రూ.19.56 లక్షల రూపాయల రుణాన్ని కూడా తీసుకున్నట్లు ప్రకటించారు.

ఆమె పొందుపరిచిన అఫిడవిట్ ప్రకారం షర్మిలకు రూ.123.26 కోట్ల చరాస్తులు ఉన్నాయి. ఇందులో సారా ఎంపైర్ హోల్డింగ్స్, ఎక్స్‌ఎస్ హైడ్రో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, స్వాతి పవర్ లిమిటెడ్, రాజ్ యువరాజ్ ఎంటర్‌ప్రైజెస్, ప్రకాష్ పైప్స్ లిమిటెడ్, చమన్ లాల్ సెటియా ఎక్స్‌పోర్ట్ లిమిటెడ్ అనే ఆరు కంపెనీల్లో రూ.2 కోట్ల విలువైన పెట్టుబడులు ఉన్నాయి.

వీటితోపాటు ఆమె వద్ద రూ. 3.69 కోట్ల విలువైన బంగారం, రూ. 4.61 కోట్ల విలువైన రత్నాలతో సహా రూ. 8.3 కోట్ల విలువైన ఆభరణాలను కలిగి ఉన్నారు. అలాగే రూ.9.29 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు కూడా తెలిపారు. అందులో రూ.1.53 కోట్ల విలువైన వ్యవసాయ భూమి, రూ.5.55 కోట్ల విలువైన వ్యవసాయేతర భూమి, కడప జిల్లాలో రూ.2.2 కోట్ల విలువైన నివాస భవనం కూడా ఉందని తెలిపారు.

ప్రముఖ వ్యాపారి అయిన షర్మిల భర్త అనిల్ కుమార్‎కు రూ.49.2 కోట్ల ఆస్తులున్నాయి. ఇందులో రూ.45.19 కోట్ల విలువైన చరాస్తులు, రూ.4.05 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. తన భార్య నుంచి రూ.29.99 కోట్ల అప్పుతో పాటు షర్మిల తల్లి వైఎస్ విజయమ్మకు రూ.40 లక్షల అప్పు ఉందని షర్మిల తన అఫిడవిట్లో పొందుపరిచారు. అలాగే ఆమె భర్త అనిల్ కుమార్ మొత్తం అప్పులు రూ. 35.81 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us