బస్సుయాత్రలో అనూహ్య పరిణామం.. ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఏం చేశారంటే..

బస్సుయాత్రలో అనూహ్య పరిణామం.. ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఏం చేశారంటే..

Pvv Satyanarayana

| Edited By: Srikar T

Updated on: Apr 20, 2024 | 12:03 PM

ప్రజల కష్టాలను విని తక్షణమే స్పందించారు సీఎం జగన్. పేదలకు భరోసా కల్పించి ప్రజల సమస్యలను తీర్చేందుకు సిద్దమయ్యారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా కాకినాడ జిల్లా నాయకంపల్లి వద్ద సీఎం జగన్ మంచి మనసును చాటిచెప్పే దృశ్యం మరొకటి తారసపడింది. సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో కృష్ణవేణి అనే పేషెంట్‎ను కలిశారు. వారి బంధువులు ఆయన కోసం ఎదురుచూస్తూ ఉండగా రోడ్డు పక్కన ఆపి ఉన్న వారి వాహనం వద్దకు జగన్ స్వయంగా నడుచుకుంటూ వెళ్లారు.

ప్రజల కష్టాలను విని తక్షణమే స్పందించారు సీఎం జగన్. పేదలకు భరోసా కల్పించి ప్రజల సమస్యలను తీర్చేందుకు సిద్దమయ్యారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా కాకినాడ జిల్లా నాయకంపల్లి వద్ద సీఎం జగన్ మంచి మనసును చాటిచెప్పే దృశ్యం మరొకటి తారసపడింది. సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో కృష్ణవేణి అనే పేషెంట్‎ను కలిశారు. వారి బంధువులు ఆయన కోసం ఎదురుచూస్తూ ఉండగా రోడ్డు పక్కన ఆపి ఉన్న వారి వాహనం వద్దకు జగన్ స్వయంగా నడుచుకుంటూ వెళ్లారు. వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. చికిత్స నిమిత్తం ఖర్చు చేసిన బిల్లులను భద్రపరచాలని పేషెంట్ బంధువులకు సూచించారు. కృష్ణవేణికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించే చర్యలను తక్షణమే చేపట్టాలని ఆరోగ్యశ్రీ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇలా ప్రతీ సందర్భంలో బాధితులకు ఆపన్న హస్తం అందిస్తూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..