AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airtel: ఏపీలో మరో మైలురాయిని అధిగమించిన ఎయిర్‌టెల్‌.. ఎంత మంది కస్టమర్‌లో తెలుసా?

భారతదేశంలోని ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7.9 మిలియన్ల మంది కస్టమర్‌లు 5G సర్వీస్‌ను ఉపయోగించుకుంటున్నట్లు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. తదుపరి జనరేషన్‌ మొబైల్ కనెక్టివిటీని అందించే దిశగా మంచి మార్పును ప్రతిబింబిస్తూ ఏపీలోని అన్ని నగరాలు, జిల్లాల్లో 5జీ సేవను కంపెనీ విజయవంతంగా అమలు చేసింది. ఏపీలో..

Airtel: ఏపీలో మరో మైలురాయిని అధిగమించిన ఎయిర్‌టెల్‌.. ఎంత మంది కస్టమర్‌లో తెలుసా?
Airtel 5g
Subhash Goud
|

Updated on: Apr 19, 2024 | 6:18 PM

Share

భారతదేశంలోని ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7.9 మిలియన్ల మంది కస్టమర్‌లు 5G సర్వీస్‌ను ఉపయోగించుకుంటున్నట్లు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. తదుపరి జనరేషన్‌ మొబైల్ కనెక్టివిటీని అందించే దిశగా మంచి మార్పును ప్రతిబింబిస్తూ ఏపీలోని అన్ని నగరాలు, జిల్లాల్లో 5జీ సేవను కంపెనీ విజయవంతంగా అమలు చేసింది. ఏపీలో గత 6 నెలల్లో ఎయిర్‌టెల్ 5జీ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సంస్థ విస్తారమైన నెట్‌వర్క్ విస్తరణ దాని సేవలను మొత్తం రాష్ట్రమంతటా సమర్థవంతంగా విస్తరించింది. వినియోగదారులు 5జీని స్వీకరించే ప్రక్రియను చాలా సులభతరం చేసింది. ఎయిర్‌టెల్ ఏపీ అంతటా దాని విస్తరణను మరింతగా పెంచుతూనే ఉంది.

ఈ మైలురాయి గురించి ఏపీ ఎయిర్‌టెల్‌ సీఈవో శివన్ భార్గవ మాట్లాడుతూ, ఏపీలో 5జీని విస్తృతంగా స్వీకరించడానికి అవసరమైన నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను నిర్మించడంలో మేము గణనీయమైన పురోగతిని సాధిస్తున్నామని అన్నారు. నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేసుకుంటున్న మా వినియోగదారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అపరిమిత 5G సేవ శక్తిని ఆస్వాదించడానికి మా వినియోగదారులను స్థిరంగా రాష్ట్రం అత్యంత వేగవంతమైన, అత్యంత విశ్వసనీయమైన, అత్యాధునిక నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడం మా అవిశ్రాంత ప్రయత్నాలని అన్నారు.

వేగవంతమైన నెట్‌వర్క్ మెరుగుదల, వేగవంతమైన 5జీ రోల్‌అవుట్, 5జీ పరికరాల పెరుగుతున్న లభ్యత వంటి బహుళ కారకాల కారణంగా దేశంలో వేగవంతమైన 5జీ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించామన్నారు. తమ పనితీరు వల్ల దేశంలో మొత్తం 5G వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడానికి సహాయపడిందన్నారు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి