Tirumala Laddu Row: ఏపీలో లడ్డూ తుఫాన్‌.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం..

ఏపీని తాకిన లడ్డూ తుఫాన్‌... తగ్గేదే లా అంటోంది. రోజురోజుకు రాజుకుని రాజకీయ రచ్చ రేపుతోంది. లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో, దేశవ్యాప్తంగా భూకంపం పుట్టించి.. ఏపీలో లడ్డూ లడాయిగా మారింది. ఈ క్రమంలోనే.. తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది..

Tirumala Laddu Row: ఏపీలో లడ్డూ తుఫాన్‌.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం..
Tirumala Laddu Controversy
Follow us

|

Updated on: Sep 23, 2024 | 1:19 PM

ఏపీని తాకిన లడ్డూ తుఫాన్‌… తగ్గేదే లా అంటోంది. రోజురోజుకు రాజుకుని రాజకీయ రచ్చ రేపుతోంది. లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో, దేశవ్యాప్తంగా భూకంపం పుట్టించి.. ఏపీలో లడ్డూ లడాయిగా మారింది. ఈ క్రమంలోనే.. తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఐజీ స్థాయి అధికారితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను నియమించనుంది.. ఐజీ అధికారి, సభ్యుల వివరాలతో ఇవాళ జీఓను విడుదల చేయనుంది. సిట్ విచారణ పరిధి, కాల పరిమితి, విధివిధానాలను ఏపీ ప్రభుత్వం ప్రకటించనుంది. కాగా.. కల్తీ నెయ్యి వివాదంపై సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు.. అమరావతిలోని సచివాలయంలో చంద్రబాబు అధికారులతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా సిట్ తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో నెయ్యి కొనుగోలు, టెండర్ల వ్యవస్థపైనా సమీక్ష నిర్వహిస్తారు.

జగన్‌ లేఖపై.. చంద్రబాబు ఫైర్..

అయితే.. లడ్డూ తుఫాన్‌.. ఏపీని అతలాకుతలం చేస్తోంది. తిరుమల కొండ మీద నుంచి కిందకు దిగాక.. ఇది పొలిటికల్‌ ఫైట్‌గా మారింది. టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ తుఫాన్‌ రేపుతోంది. ఇదే అంశంపై ప్రధాని మోదీకి వైసీపీ అధినేత జగన్‌ లేఖ రాయడం హాట్‌ టాపిక్‌గా మారింది. టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ ప్రధానికి జగన్ లేఖ రాశారు. రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి స్థాయి మరిచి ప్రవర్తించారని ఆ లేఖలో విపక్ష నేత పేర్కొన్నారు. లడ్డూ వివాదంలో నిజానిజాలు వెలుగులోకి రావాలని.. కల్తీ నెయ్యి అంటూ అసత్యాలు ప్రచారం చేసిన చంద్రబాబును తీవ్రంగా మందలించాలంటూ ప్రధానిని జగన్‌ కోరారు. టీటీడీ పవిత్రతను పునరుద్ధరించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

ఇక జగన్‌ లేఖపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తప్పు చేసిందే కాకుండా ప్రధాని మోదీకే లేఖ రాస్తారా? ఎంత ధైర్యం మీకు అంటూ ప్రశ్నించారు. తిరుమల లడ్డూ తయారీలో ఆవు నెయ్యి కల్తీపై ఐజీ స్థాయి అధికారితో సిట్‌ ఏర్పాటు చేస్తామన్నారు చంద్రబాబు. సిట్ రిపోర్ట్‌ వచ్చాక కఠిన చర్యలు ఉంటాయన్నారు. జగన్‌ హయాంలో ట్రస్ట్‌ బోర్డు మెంబర్లను ఇష్టం వచ్చినట్లు నియమించారని, బోర్డును భ్రష్టు పట్టించారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రధాని మోదీకి జగన్‌ లెటర్‌ రాయడం, చంద్రబాబు లేటెస్ట్‌ మాటల తూటాలతో…లడ్డూ తుఫాన్‌ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..