Srikakulam: నలుగురు మోయాల్సిన పాడె ఇద్దరే ఎందుకు.? చచ్చినా మాకీ కష్టాలు తప్పవు..
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం లింగాలవలస గ్రామస్తులను దారుణ పరిస్థితి వెంటాడుతోంది. చనిపోయిన వారి అంత్యక్రియలు జరిపేందుకు స్మశానానికి వెళ్ళే త్రోవ లేక గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సోమవారం గ్రామంలోని ఓ వ్యక్తి మృతి చెందగా అతని మృతదేహాన్ని మోకాళ్ల లోతు నీటిలో పొలం గట్లపై మోస్తూ స్మశానానికి తరలించారు గ్రామస్తులు. జీవితంలో ఏం సంపాదించినా..
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం లింగాలవలస గ్రామస్తులను దారుణ పరిస్థితి వెంటాడుతోంది. చనిపోయిన వారి అంత్యక్రియలు జరిపేందుకు స్మశానానికి వెళ్ళే త్రోవ లేక గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సోమవారం గ్రామంలోని ఓ వ్యక్తి మృతి చెందగా అతని మృతదేహాన్ని మోకాళ్ల లోతు నీటిలో పొలం గట్లపై మోస్తూ స్మశానానికి తరలించారు గ్రామస్తులు. జీవితంలో ఏం సంపాదించినా సంపాదించకపోయినా చివరకు చనిపోయాక స్మశానానికి తీసుకువెళ్లే క్రమంలో పాడి మోసేందుకు నలుగురు వ్యక్తులనైనా సంపాదించుకోవాలంటారు. కానీ ఈ గ్రామంలో నలుగురు కలిసి పాడి మోస్తూ మృతదేహాన్ని స్మశానానికి తీసుకువెళ్ళే మార్గమే కరువైంది. దీంతో నలుగురు మోయాల్సిన పాడిని ఇద్దరు వ్యక్తులే మోస్తూ కష్టం మీద స్మశానానికి తరలించారు.
వర్షాకాలం అయితే బురదగా ఉన్న గట్లపై ఎక్కడ జారీ పడతమో తెలియని పరిస్థితి ఉంటుంది. తరాలు మారినా, ప్రభుత్వాలు మారినా ఆ గ్రామంలో పరిస్థితి మాత్రం మారటం లేదు. గతంలో అనేకసార్లు అధికారులకు, నేతలకు తమ గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు. రహదారి లేక నిత్యం ఛస్తూ బ్రతికే తమకు చనిపోయాక కూడా కష్టాలు తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కల్పించుకొని తమ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.