Viral News: మీ గొడవ గోదాట్లో కొట్టుకెళ్ళ.. మనిషితో పాటు బస్సు తగలెట్టారేంట్రా.. ఎక్కడంటే?
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లి గ్రామంలో స్కూలు బస్సు డ్రైవర్, క్లీనర్ మధ్య చోటు చేసుకున్న వివాదం బస్సును తగలబెట్టే వరకు వెళ్ళింది.ఈ ఘటనలో బస్సు డ్రైవర్ నబి కి తీవ్ర గాయాలుకావడంతో స్థానికులు అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లి గ్రామంలో స్కూలు బస్సు డ్రైవర్, క్లీనర్ మధ్య చోటు చేసుకున్న వివాదం బస్సును తగలబెట్టే వరకు వెళ్ళింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ నబికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికలు అతన్ని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. కంభం మండలం ఆల్ఫా స్కూలుకు చెందిన స్కూల్ బస్సును ఎప్పటిలాగే విద్యార్థులను ఇళ్లకు చేర్చి పాపినేనిపల్లి దగ్గర సోమవారం సాయంత్రం నిలిపివేశారు. అయితే విధులు నిర్వహించుకునే విషయంపై డ్రైవర్ నబీకి, క్లీనర్ గోపాల్ కు గత మూడు రోజులుగా వాగ్వాదం జరుగుతోంది. దీంతో నబీపై పగ పెంచుకున్న గోపాల్ అతన్ని ఎలాగైన ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకన్నాడు.
మంగళవారం తిరిగి విద్యార్థులను స్కూలుకు తరలించే క్రమంలో బస్సు స్టార్ట్ కాలేదు. దీంతో డ్రైవర్ నబి బస్సుకు ఏమైందో చూద్దామని కిందకు దిగి చెక్ చేశాడు.సెల్ఫ్ మోటర్ ప్రాబ్లమ్ అని తెలుసుకొని రిపేర్ చేస్తున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన గోపాల్.. వెనక నుంచి బస్సుతో పాటు డ్రైవర్ నబిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
దీంతో బస్సు కింద ఉన్న డ్రైవర్ నబికి తీవ్రంగా గాయపడ్డాడు. కాలిన గాయల నొప్పి తట్టుకోలేక అతను కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని మంటలార్పేశారు. ఆ తర్వాత అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. ఇక మంటల్లో బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. బస్సుకు అంటుకున్న మంటలను స్థానికులు నీళ్లతో ఆర్పి అదుపు చేశారు. బస్సును తగులబెట్టిన క్లీనర్ గోపాల్ పరారీలో ఉన్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
