AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: 5వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య.. పూరి గుడిసెలో దూలానికి వేలాడుతూ కనిపించిన బాలిక!

గిరిజన కుటుంబంలో పుట్టినా.. కడుపు నిండా తిండి లేకపోయినా.. చదువులో మాత్రం సరస్వతి ఆ బాలిక. పూరిగుడిసెలో ఉండే ఆ బాలిక తెలివితేటలు చూసి చదువు చెప్పే ఉపాధ్యాయులు కూడా ఎనలేని అభిమానం చూపేవారు. బాలికపై ఎంతో మమకారం పెంచుకున్న ఉపాధ్యాయులు తాము తెచ్చుకున్న ఆహారం కూడా బాలికకు పెట్టేవారు. ఎప్పుడైనా పాఠశాలకు రాకపోతే ఇంటికెళ్లి మరీ కారణం ఏమిటో తెలుసుకునేవారు..

Andhra Pradesh: 5వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య.. పూరి గుడిసెలో దూలానికి వేలాడుతూ కనిపించిన బాలిక!
Class 5 Student Suicide Case
Srilakshmi C
|

Updated on: Feb 20, 2024 | 7:56 AM

Share

సీతానగరం, ఫిబ్రవరి 20: గిరిజన కుటుంబంలో పుట్టినా.. కడుపు నిండా తిండి లేకపోయినా.. చదువులో మాత్రం సరస్వతి ఆ బాలిక. పూరిగుడిసెలో ఉండే ఆ బాలిక తెలివితేటలు చూసి చదువు చెప్పే ఉపాధ్యాయులు కూడా ఎనలేని అభిమానం చూపేవారు. బాలికపై ఎంతో మమకారం పెంచుకున్న ఉపాధ్యాయులు తాము తెచ్చుకున్న ఆహారం కూడా బాలికకు పెట్టేవారు. ఎప్పుడైనా పాఠశాలకు రాకపోతే ఇంటికెళ్లి మరీ కారణం ఏమిటో తెలుసుకునేవారు. పాఠశాలలో ఐదో తరగతి చదువుతోన్న ఆ బాలికతో ప్రతిఒక్కరూ ఎంతో అభిమానంతో మెదిలేవారు. అయితే.. ఏం జరిగిందో తెలియదు గానీ ఆ గిరిజన బాలిక తమ గుడిసెలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడి గ్రామంలో సోమవారం (ఫిబ్రవరి 19) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడికి చెందిన ఈరేటి వసంత (10) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. ఎప్పటి మాదిరిగానే సోమవారం ఉదయం కూడా యథావిధిగా పాఠశాలకు వెళ్లింది. పాఠశాలలో తోటి విద్యార్ధులతో ఉత్సాహంగా గడిపింది. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినింది. మధ్యాహ్న భోజనం చేసి పాఠశాల నుంచి ఇంటికి వెళ్లింది. ఏం జరిగిందో తెలియదు తమ పూరిగుడిసెలోని వెదురు దూలానికి చీరతో ఉరేసుకుని బాలిక విగత జీవిగా కనిపించింది. పాఠశాలకు సమీపంలోనే బాలిక ఇల్లు ఉంది.

మధ్యాహ్నం పుస్తకాల కోసం ఇంటికి వెళ్లి ఉంటుందని ప్రధానోపాధ్యాయిని ప్రవీణ చెబుతున్నారు. మధ్యాహ్నం విరామ సమయం ముగిసినా బాలిక తిరిగి పాఠశాలకు రాలేదు. ఏం జరిగిందో తోటి విద్యార్ధులను అడిగి తెలుసుకుంటున్న క్రమంలో ఇంతలో బాలిక ఉరేసుకుని మృతిచెందిన వార్త తెలిసిందని ఆమె తెలిపారు. వచ్చే ఏడాది ఆరో తరగతిలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని, ఏం జరిగిందో తెలియట్లేదని తెలిపారు. బాలికకు తల్లి ఉన్నా మానసిక స్థితి సరిగ్గా ఉండదని, అందువల్లనే వరుసకు బంధువైన దమయంతి అనే 70 ఏళ్ల వృద్ధురాలి వద్ద ఉంటోంది. బాలిక శరీరంపై ఎటువంటి గాయాలు లేవు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని ఎస్సై టి రామకృష్ణ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.