Gold Price Today: పెరిగిన బంగారం ధర.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందో తెలుసా.?

దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,610గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 62,380వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,460 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,680గా ఉంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం...

Gold Price Today: పెరిగిన బంగారం ధర.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందో తెలుసా.?
Gold Price Today
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 20, 2024 | 6:22 AM

బంగారం ధరల్లో ప్రతీ రోజు హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. అయితే ఒకప్పుడు భారీగా కనిపించిన ఈ మార్పు ప్రస్తుతం స్వల్పంగా మారింది. బంగారం ధరలో హెచ్చుతగ్గులు స్వల్పంగా దీంతో బంగారం ధర గడిచిన కొన్నిరోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మంగళవారం బంగారం ధరలో కాస్త పెరుగుదల కనిపించింది. తులం గోల్డ్‌పై రూ. 10 పెరిగింది. దీంతో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,460 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,680కి చేరింది. మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,610గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 62,380వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,460 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,680గా ఉంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,010గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 63,280 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,460గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్‌ రూ. 62,680 వద్ద కొనసాగుతోంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ. 57,460గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,680 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,460గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,680 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,460కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,680గా ఉంది. ఇక సాగర నగరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 57,640, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,680 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధర పెరిగితే వెండి ధర తగ్గుముఖం పట్టింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. దీంతో మంగళవారం కిలో వెండి ధర రూ. 75,900వద్ద కొనసాగుతోంది. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. దేశరాజధాని ఢిల్లీతో పాటు కోల్‌కతా, ముంబయి, జైపూర్‌ లక్నో వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 75,900 వద్ద కొనసాగుతోంది. అలాగే చెన్నై, కేరళతో పాటు విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 77,400 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..