EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఇకపై ఆ ప్రక్రియ మరింత సులభతరం.. పూర్తి వివరాలు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఓ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈపీఎఫ్ ఖాతా కలిగిన వారు ప్రభుత్వం విధించిన పరిమితికి మించి ఎక్కువ కంట్రిబ్యూషన్ చెల్లించాలనుకుంటే ప్రత్యేక వెసులుబాటును కల్పించింది. దీని కోసం ఓ క్రమబద్ధమైన డిజిటలైజ్డ్ ప్రక్రియను పరిచయం చేసింది. సభ్యులకు యాక్సెసిబిలిటీ, సౌలభ్యాన్ని పెంపొందించడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు ప్రకటించింది.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఓ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈపీఎఫ్ ఖాతా కలిగిన వారు ప్రభుత్వం విధించిన పరిమితికి మించి ఎక్కువ కంట్రిబ్యూషన్ చెల్లించాలనుకుంటే ప్రత్యేక వెసులుబాటును కల్పించింది. దీని కోసం ఓ క్రమబద్ధమైన డిజిటలైజ్డ్ ప్రక్రియను పరిచయం చేసింది. సభ్యులకు యాక్సెసిబిలిటీ, సౌలభ్యాన్ని పెంపొందించడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు ప్రకటించింది. ఆ ప్రక్రియకు సంబంధించిన నియమాలు, నిబంధనలు, విధానం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
నిబంధనలు ఇలా..
ఈపీఎఫ్ ఖాతాదారులు పరిమితికి మించి అదనపు కంట్రిబ్యూషన్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ప్రక్రియ చాలా సరళతరం అయ్యింది. వాస్తవానికి ఈపీఎఫ్ స్కీమ్, 1952 చట్టంలోని పేరా 26(6) ప్రకారం, వ్యక్తులు తప్పనిసరిగా ఉమ్మడి అభ్యర్థనను సమర్పించాలి. చట్టబద్ధమైన పరిమితికి మించి కంట్రిబ్యూషన్ ఇవ్వడానికి అనుమతిని పొందాలి. అయితే 2023, అక్టోబర్ 31న జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) 234వ సమావేశంలో ఈ క్రమబద్ధీకరించబడిన ప్రక్రియను ప్రవేశపెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో చట్టంలోని పేరా 26(6) కింద ఉమ్మడి అభ్యర్థనలను సులభతరం చేయడానికి ప్రామాణిక ఫార్మేట్ ను తీసుకొచ్చింది. ప్రక్రియను క్రమబద్ధీకరించడం, అభ్యర్థనల సమర్పణ, ప్రాసెసింగ్‌లో ఏకరూపతను నిర్ధారించడం లక్ష్యంగా దీనిని ప్రవేశపెట్టింది. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని సమావేశం తీర్మానించింది. ఈ ప్రామాణిక ఫార్మేట్ ని ఉపయోగించి అభ్యర్థనలు డిజిటల్‌గా ఫైల్ అవుతాయి. అలాగే ప్రాసెస్ కూడా ఆన్ లైన్లోనే అవుతుంది. ఈ డిజిటల్ ఫైలింగ్‌కి ఈ పరివర్తన ఈపీఎఫ్ఓ ఫ్రేమ్‌వర్క్‌లో సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదే సమయంలో పేపర్ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలకు కూడా దోహదపడుతుంది.
ఇకపై అది అవసరం లేదు..
ఇప్పటికే చట్టబద్ధమైన పరిమితిని మించి కంట్రిబ్యూషన్ ఇస్తున్న సభ్యులు.. వారి యజమానులకు ఈ కంట్రిబ్యూషన్‌లపై అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు చెల్లిస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన అధీకృత ఫార్మేట్ ను ఉపయోగించి జాయింట్ అభ్యర్థనలను వెంటనే ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. అయితే, ఈ మినహాయింపు ఈపీఎఫ్ స్కీమ్, 1952లోని పారా 26(6) కింద వచ్చే కేసులకు మాత్రమే వర్తిస్తుందని గమనించాలి. ఈపీఎఫ్ స్కీమ్, 1952లోని పేరా 26(6) కింద జాయింట్ రిక్వెస్ట్‌ను అర్థం చేసుకోవడం ఖాతాదారులకు కీలకం. ఈ నిబంధన ప్రత్యేకంగా చట్టబద్ధమైన పరిమితిని మించిన వేతనాలపై కంట్రీబ్యూషన్ ను తెలియజేస్తుంది. దీని ప్రకారం ఉద్యోగి, యజమాని ఇద్దరూ సంయుక్తంగా ఒక ఆప్షన్ ను సమర్పించవలసి ఉంటుంది, ఈ ఉమ్మడి అభ్యర్థనను ఈపీఎఫ్ఓ అంగీకరిస్తేనే అదనపు కంట్రిబ్యూషన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై అది అవసరం లేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








