AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhattisgarh: సీఏఎఫ్‌ కమాండర్‌ను పొట్టనపెట్టుకున్న మావోలు.. గస్తీలో ఉండగా గొడ్డలితో నరికి చంపిన వైనం

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బిజాపూర్‌ జిల్లా ఏజెన్సీలో మావోయిస్టులు సాయుధ బలగాల కమాండర్‌ స్థాయి అధికారిని దారుణంగా చంపారు. అందిన సమాచారం మేరకు.. కుట్రు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దర్బా గ్రామంలో ఆదివారం జరిగే సంతకు ఛత్తీస్‌గఢ్‌ సాయుధ బలగాల 4వ బెటాలియన్‌ జవాన్లు పెట్రోలింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ (సీఏఎఫ్‌) 4వ బెటాలియన్‌ కమాండర్‌ తిజౌరామ్‌ భూర్య ఆదివారం కుట్రు పోలీస్‌స్టేషన్‌ పరిధి..

Chhattisgarh: సీఏఎఫ్‌ కమాండర్‌ను పొట్టనపెట్టుకున్న మావోలు.. గస్తీలో ఉండగా గొడ్డలితో నరికి చంపిన వైనం
Naxals attacked on Chhattisgarh Armed Force
Srilakshmi C
|

Updated on: Feb 19, 2024 | 8:05 AM

Share

చర్ల, ఫిబ్రవరి 19: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బిజాపూర్‌ జిల్లా ఏజెన్సీలో మావోయిస్టులు సాయుధ బలగాల కమాండర్‌ స్థాయి అధికారిని దారుణంగా చంపారు. అందిన సమాచారం మేరకు.. కుట్రు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దర్బా గ్రామంలో ఆదివారం జరిగే సంతకు ఛత్తీస్‌గఢ్‌ సాయుధ బలగాల 4వ బెటాలియన్‌ జవాన్లు పెట్రోలింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ (సీఏఎఫ్‌) 4వ బెటాలియన్‌ కమాండర్‌ తిజౌరామ్‌ భూర్య ఆదివారం కుట్రు పోలీస్‌స్టేషన్‌ పరిధి అటవీప్రాంతంలోని సీఏఎఫ్‌ క్యాంప్‌నకు 200 మీటర్ల దూరంలో తన సిబ్బందితో కలిసి వంట చెరకు సేకరిస్తున్నాడు. అప్పటికే కాపు కాసిన మావోయిస్టులు ఉదయం 9.30 గంటల సమయంలో గ్రామీణుల వేషధారణలో వచ్చి ఏమరుపాటుగా ఉన్న కమాండర్‌ తేజో రాం బౌర్యాను అపహరించారు. అనంతరం అతని తలపై గొడ్డలితో వేటు వేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి, ప్రాణాలొదిలారు. ఆ వెంటనే మావోయిస్టులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న బలగాలు సంఘటనా స్థలానికి చేరుకోగా రక్తపు మడుగులో ఉన్న భూర్య విగతజీవిగా ఉండటం గమనించారు. భూర్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు.

కమాండర్‌ హత్యను సీరియస్‌గా తీసుకున్న అక్కడి పోలీస్‌ ఉన్నతాధికారులు ఘటన జరిగిన స్థలంలో భారీగా భద్రతా దళాలను మోహరించి, గస్తీ నిర్వహించారు. మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కాగా, హత్యకు గురైన కమాండర్‌ తేజో రాం బౌర్యా స్వగ్రామం నారాయణ్‌పూర్‌ జిల్లాలోని భానుప్రతాపపురంగా అధికారులు వెల్లడించారు. మరోవైపు మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ షరతులతో కూడిన చర్చలకు అంగీకరిస్తున్నట్లు ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌ ఉప ముఖ్యమంత్రి విజయ్‌శర్మ పిలుపు మేరకు ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సందర్భంలో మావోయిస్టులు ఓ కమాండర్‌ను పొట్టన పెట్టుకోవడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని సర్వత్రా చర్చజరుగుతోంది.

కాగా గత నెలలోనూ ఇదే రాష్ట్రంలోని సుక్మా ప్రాంతంలో నక్సల్స్‌ జరిపిన దాడిలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు. భద్రతా సిబ్బంది సంయుక్త బృందం సెర్చ్ ఆపరేషన్‌లో ఉండగా టేకలగూడెం గ్రామ సమీపంలో ఈ సంఘటన జరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.