AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Interrogation: ఫైళ్లు ఎలా మాయమయ్యాయి.. మొదటి సెషన్‌లో చంద్రబాబును సీఐడీ అడిగిన ప్రశ్నలు ఇవేనా!

స్కిల్ డవలప్‌మెంట్ కేసు.. చంద్రబాబు నాయుడు విచారణ 2రోజులు.. 15గంటలు.. 120 ప్రశ్నలు.. మొత్తం ఆధారాలతో సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. డాక్యుమెంట్స్‌ ముందుపెట్టి బాబబుపై మోపిన మొత్తం 34 అభియోగాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు సీఐడీ అధికారులు.. బాబు తరఫున ఇద్దరు లాయర్ల సమక్షంలోనే.. లోకేష్‌, కిలారి రాజేష్‌, పీఏ శ్రీనివాస్‌ పాత్రపై ఆరా తీస్తోంది.

Chandrababu Interrogation: ఫైళ్లు ఎలా మాయమయ్యాయి.. మొదటి సెషన్‌లో చంద్రబాబును సీఐడీ అడిగిన ప్రశ్నలు ఇవేనా!
Chandrababu Naidu Arrest
Shaik Madar Saheb
|

Updated on: Sep 23, 2023 | 2:20 PM

Share

స్కిల్ డవలప్‌మెంట్ కేసు.. చంద్రబాబు నాయుడు విచారణ 2రోజులు.. 15గంటలు.. 120 ప్రశ్నలు.. మొత్తం ఆధారాలతో సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. డాక్యుమెంట్స్‌ ముందుపెట్టి బాబుపై మోపిన మొత్తం 34 అభియోగాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు సీఐడీ అధికారులు.. బాబు తరఫున ఇద్దరు లాయర్ల సమక్షంలోనే.. లోకేష్‌, కిలారి రాజేష్‌, పీఏ శ్రీనివాస్‌ పాత్రపై ఆరా తీస్తోంది. మధ్య మధ్యలో 5 నిమిషాలు విరామం తర్వాత..మళ్లీ ప్రశ్నిస్తోంది. ఉదయం పదిగంటలకు మొదలైన విచారణ లంచ్‌ బ్రేక్‌ వరకూ కొనసాగింది. మొదటి సెషన్‌లో 3 గంటలకు పైగా సీఐడీ అధికారులు విచారణ చేశారు. ప్రతి గంటకు ఇద్దరు చొప్పున సీఐడీ అధికారులు చంద్రబాబును ప్రశ్నించారు.

ఉదయం 9.30 గంటలకు రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు చేరుకున్నారు సీఐడీ అధికారులు బృందం. 9 మంది అధికారుల బృందం స్కిల్‌ స్కాంలో ఉదయం 10 గంటలకు విచారణ మొదలు పెట్టింది. జైలులోని చంద్రబాబు బ్యారక్‌ ప్రాంతంలోనే ప్రత్యేక గదిలో విచారణ కొనసాగింది. విచారణలో ఇద్దరు మధ్యవర్తులు, ఒక ఫొటో గ్రాఫర్‌ ఉన్నారు. ధనుంజయ నేతృత్వంలో ఒక్కో టీమ్‌లో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు ఉన్నారు. చంద్రబాబు సమాధానాలను రికార్డు చేసేందుకు ల్యాప్‌టాప్‌, ప్రింటర్లు, వీడియో చిత్రీకరణ చేశారు. విచారణకు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

మొదటి గంటలో చంద్రబాబును వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగారు సీఐడీ అధికారులు. ఇప్పటివరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు సేకరించిన ఆధారాలకు అనుగుణంగా ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ ఎందుకు అమెరికా పారిపోయాడు? పెండ్యాల శ్రీనివాస్‌ అమెరికా వెళ్లేందుకు విమాన టికెట్లు ఎవరు తీసుకున్నారు? సీమెన్స్ మాజీ ఎండి సుమన్ బోస్‌తో ఏ ఏ లావాదేవీలు నిర్వహించారు? చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు ఇన్‌కమ్‌టాక్స్‌ శాఖ ఇచ్చిన నోటీసులపై ఏమంటారు? డిజైన్టెక్ కంపెనీ అధిపతి ఖన్వేల్కర్‌తో ఉన్న అనుబంధమేంటీ?షెల్‌ కంపెనీల ఏర్పాటు వెనక ఎవరెవరు ఉన్నారు? స్కిల్‌ డెవలప్‌మెంట్‌ నిధుల విడుదలకు ఎందుకు తొందరపడ్డారు? అధికారులపై ఎందుకు ఒత్తిడి తెచ్చారు? కీలకమైన ఫైళ్లు ఎలా మాయమయ్యాయి?

మొదటి సెషన్‌లో సీఐడీ అడిగిన ప్రశ్నలు ఇవేనా!

  1. సీమెన్స్ కు తెలియకుండానే వారి పేరుతో దోపిడీకి స్కెచ్ గీశారా ?
  2. కేబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కి ప్లాన్ చేశారా ?
  3. స్కిల్ డెవలప్ మెంట్ లో సీమెన్స్ 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% అని జీవో ఇచ్చారా? లేదా ?
  4. సీమెన్స్ కంపెనీతో కాకుండా.. సుమన్ బోస్ అనే వ్యక్తితో MOU చేసుకున్నారా? లేదా ?
  5. 330 కోట్ల ప్రాజెక్టును.. దోచుకోవడం కోసమే ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3356 కోట్లని చూపించారా? లేదా ?
  6. అధికారులు అభ్యంతరం చెప్పినా డబ్బు రిలీజ్ చేయాలని ఆదేశించారా? లేదా ?
  7. సీమెన్స్ తో ఒప్పందం అని చెప్పి.. డైరెక్ట్ గా డిజైన్ టెక్ కు 371 కోట్లు రిలీజ్ చేశారా? లేదా?
  8. నిధుల విడుదల నుంచి షెల్ కంపెనీలకు డైవర్ట్ చేసేంత వరకు మీ కనుసన్నల్లోనే జరిగిందా? లేదా ?
  9. డిజైన్ టెక్ నుంచి రూ. 240 కోట్ల ప్రజాధనాన్ని షెల్ కంపెనీలకు మళ్ళించారా? లేదా ?
  10. గంటా సుబ్బారావుకు, లక్ష్మీనారాయణకు చెందిన కంపెనీలకు ఆ నిధులు వెళ్ళాయా? లేదా ?
  11. సుమన్ బోస్, ఖన్వేల్కర్ ను జీఎస్టీ, ఈడీ పట్టుకోవడంతో నోట్‌ ఫైల్స్ మాయం చేయించారా? లేదా ?
  12. సంబంధం లేదు అంటున్న మీరే.. 13 చోట్ల సంతకాలు పెట్టారా? లేదా ?

మొదటి సెషన్‌లో 3 గంటలపాటు చంద్రబాబును విచారించారు సీఐడీ అధికారులు. రాజమండ్రి సెంట్రల్‌ జైలు కాన్ఫరెన్స్‌ హాల్లో సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో అధికారులు ప్రశ్నలు వేశారు. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం విచారణ అంశాలు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..