IRCTC: అరకు అందాలు వీక్షించేందుకు అద్భుత అవకాశం.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజ్..
రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రకృతి అందాలను వీక్షించేందుకు విశాఖకు వస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజ్‌తో ఒకే రోజులో అరకును వీక్షించవచ్చు. విశాఖపట్నం నుంచి ఈ ప్రయాణం మొదలవుతుంది...

ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకు అందాలను ఒక్కసారైనా చూడాలని చాలా మంది కోరుకుంటారు. రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రకృతి అందాలను వీక్షించేందుకు విశాఖకు వస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజ్‌తో ఒకే రోజులో అరకును వీక్షించవచ్చు. విశాఖపట్నం నుంచి ఈ ప్రయాణం మొదలవుతుంది. రాత్రిసరికి ప్యాకేజీ ముగుస్తుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
ప్రతీ రోజూ ఉదయం విశాఖ నుంచి అరకుకు రైలు అందుబాటులో ఉంటుంది. ఉదయం 6.45 గంటలకు 08551 నెంబర్ రైలు విశాఖ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ప్రకృతి అందాల నడుమ ఈ ప్రయాణం సాగుతుంది. సొరంగాలు, బ్రిడ్జిలు వంటి ప్రకృతి రమణీయత నడుమ రైలు ప్రయాణం ఉంటుంది. అనంతరం ఆదివాసీ మ్యూజియం, చాపరాయి గార్డెన్స్ వంటివి చూడొచ్చు. మధ్యాహ్నం భోజనం ఉంటుంది. అనంతరం విశాఖకు తిరుగు ప్రయాణం ఉంటుంది. తిరుగు ప్రయాణం రోడ్డు మార్గంలో సాగుతుంది. ఇందులో భాగంగా కాఫీ తోటలు, బొర్ర గుహ విజిటింగ్ ఉంటుంది. తిరిగి వైజాగ్ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోవడంతో ప్రయాణం ముగుస్తుంది.
ప్యాకేజీ వివరాలు..
2s క్లాసులో ప్రయాణిస్తే పెద్దలకు రూ. 2,130, 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ. 1760 చెల్లించాల్సి ఉంటుంది. ఇక SL క్లాసులో ప్రయాణించే పెద్దలకు రూ. 2,385, 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ. 1915 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎగ్జిక్యూటివ్ ఛైర్ కారు విషయానికొస్తే పెద్దలకు రూ. 4450, 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు రూ. 4,080 ఉంటుంది. రైలు టికెట్లు, ప్యాకేజీలో పొందుపరిచిన సందర్శన స్థలాల విజిటింగ్ ప్యాకేజీలో ఇన్‌క్లూడెడ్‌గా ఉంటుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందిస్తారు. బొర్రా గుహల ఫీజు ప్యాకేజీలో భాగంగానే ఉంటుంది.
మరిన్ని ట్రావెల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..




